గుంటూరు నగరపాలక సంస్థ కార్యాలయంలో సోమవారం మేయర్ కావెలమూడి రవీంద్ర అధ్యక్షతన కౌన్సిల్ సాధారణ సమావేశంతో పాటు, బడ్జెట్‌పై అత్యవసర సమావేశం జరగనుంది. ప్రస్తుత పాలక వర్గానికి ఇదే చివరి సమావేశం కావడంతో దీనికి ప్రాధాన్యత ఏర్పడింది. ఇప్పటికే ప్రభుత్వం ప్రత్యేక అధికారులను నియమించిన నేపథ్యంలో, ఈ భేటీ తర్వాత పాలన వారి చేతుల్లోకి వెళ్లనుంది.