WGL: వర్ధన్నపేట నియోజకవర్గంలో నిధుల కొరత కారణంగా పెండింగ్లో ఉన్న అభివృద్ధి పనులపై శాసనసభలో మాట్లాడనున్నట్లు MLA KR నాగరాజు తెలిపారు. నేడు జరగనున్న శాసనసభ సమావేశంలో నియోజకవర్గంలోని పలు ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి వాటి పరిష్కారం కోసం కృషి చేస్తానని ఆయన పేర్కొన్నారు. అభివృద్ధి పనులకు నిధులు కేటాయించాలని ప్రభుత్వాన్ని కోరుతానని అన్నారు