GDWL: జిల్లాలో గృహ అవసరాల గ్యాస్ సిలిండర్ల సరఫరాలో ఎలాంటి కొరత లేదని కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ స్పష్టం చేశారు. శుక్రవారం హైదరాబాద్ నుంచి మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో ఆయన పాల్గొన్నారు. సిలిండర్ల కోసం వినియోగదారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, సరఫరా నిరంతరం కొనసాగుతుందని ఆయన పేర్కొన్నారు.