HYD: మూసి గడ్డి బువ్వ పెడుతోంది. అదేలా అంటారా..? నగరంలో ట్రాక్టర్లు, ఆటోలు, లారీలలో పశువుల గడ్డి తరలిస్తుంటే చూస్తుంటాం. అయితే, దాదాపు 80 శాతం గడ్డి మూసి నది ఒడ్డున పుట్టిందే. మూసి పక్కన రైతన్నల పొలాల్లోనూ ఈ గడ్డి నాటుకుపోయింది. దీంతో ఓ వైపు రైతన్నలకు ఆర్థిక లాభం చేకూరుస్తూ, మరోవైపు పశువుల ఆకలి తీరుస్తూ బువ్వ పెడుతోంది.