CTR: వెదురుకుప్పం మండలం పూలవారి కండ్రిగ సమీపంలో మృతదేహాన్ని కాల్చినట్లు అనుమానాస్పద ఆనవాళ్లు వెలుగులోకి వచ్చాయి. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాన్ని కాల్చినట్లు కనిపిస్తున్న ఈ ఘటనకు సంబంధించిన నిజానిజాలు పోలీసుల దర్యాప్తులో వెలుగులోకి రావాల్సి ఉంది. ప్రస్తుతం ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.