VSP: విశాఖపట్నం రైల్వే న్యూ కాలనీలోని విశ్వతేజ స్కూల్ సమీపంలో రోడ్డుకు అడ్డంగా వెలిసిన బడ్డీ కొట్లతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా పదో తరగతి పరీక్షలు జరుగుతున్న సమయంలో ఈ ఆక్రమణల వల్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. రోడ్డుకు ఇరువైపులా నిబంధనలకు విరుద్ధంగా డబ్బాలను ఏర్పాటు చేయడంతో విద్యార్థులు ఇబ్బంది పడ్డారు.