GNTR: అమరావతిలోని హెచ్ఓడీ (HOD) టవర్-1 వద్ద స్ట్రక్చరల్ స్టీల్ డైయాగ్రిడ్ పనులను మంత్రి నారాయణ సోమవారం ప్రారంభించారు. మొత్తం 49 అంతస్తులతో (B+G+49) అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ టవర్ నిర్మాణం జరగనుంది. ఇప్పటికే రాఫ్ట్ ఫౌండేషన్ పనులు పూర్తి కావడంతో, షాపూర్జీ పల్లోంజి సంస్థ తదుపరి పనులను వేగవంతం చేసింది.