ADB: నార్నూర్ మండలం కొత్తపల్లి బంజారా దీక్షా భూమి పీఠాధిపతి ప్రేమ్ సింగ్ మహారాజ్ తపస్సు చేసిన పవిత్ర ప్రదేశం శంకర్ లొద్దికి ఈనెల 19న మహా పాదయాత్ర నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీ సభ్యుడు దేవేందర్ రాథోడ్ తెలిపారు. సేవాలాల్ దీక్షాపరులు, భక్తులు ఈ యాత్రలో పెద్ద సంఖ్యలో పాల్గొనాలని కోరారు. ఉమ్మడి జిల్లాతో పాటు పొరుగు రాష్ట్రాల నుంచి భక్తులు తరలిరానున్నారు.