అన్నమయ్య: రాయచోటిలోని భద్రకాళి సమేత వీరభద్ర స్వామి ఆలయంలో సోమవారం పల్లకి సేవను అత్యంత వైభవంగా నిర్వహించారు. ప్రతి సోమవారం జరిగే ఈ కార్యక్రమంలో భాగంగా ఉత్సవ మూర్తులను పల్లకిలో ఉంచి ఆలయ ప్రాకారంలో ఊరేగించారు. ఆంధ్రప్రదేశ్తో పాటు కర్ణాటక, మహారాష్ట్రల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు హాజరై స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు అర్చనలు, తీర్థప్రసాదాలు అందజేశారు.