»Manchu Lakshmi Had A Bitter Experience On The Indigo Flight
Indigo : ఇండిగో విమానంలో మంచు లక్ష్మికి చేదు అనుభవం
సినీ నటి మంచు లక్ష్మి ప్రసన్నకి (Manchu laxmi prsasanna) ఇండిగో విమానంలో చేదు అనుభవం ఎదురైంది. విమానంలో తన పర్స్ మరచిపోవడంతో గేటు బయట గంటకు పైగా కూర్చోవాల్సి వచ్చిందని ఆమె ట్వీట్ చేశారు. ఆ సమయంలో తాను 103 డిగ్రీల జ్వరంతో ఉన్నా.. ఇండిగో సిబ్బంది పట్టించుకోకపోవడంపై ఆమె అసహనం వ్యక్తం చేశారు.
సినీ నటి మంచు లక్ష్మి ప్రసన్నకి (Manchu laxmi prsasanna) ఇండిగో విమానంలో చేదు అనుభవం ఎదురైంది. విమానంలో తన పర్స్ మరచిపోవడంతో గేటు బయట గంటకు పైగా కూర్చోవాల్సి వచ్చిందని ఆమె ట్వీట్ చేశారు. ఆ సమయంలో తాను 103 డిగ్రీల జ్వరంతో ఉన్నా.. ఇండిగో సిబ్బంది పట్టించుకోకపోవడంపై ఆమె అసహనం వ్యక్తం చేశారు. దీంతో దేశీయ విమానయాన సంస్థ ఇండిగోపై (Indigo) మంచు లక్ష్మి (Lakshmi Manchu) ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం తిరుపతి (Tiripathi) నుంచి హైదరాబాద్‌కు ఇండిగో విమానంలో వచ్చిన లక్ష్మీ ప్రసన్న.. తాను ప్రయాణించిన సమయం కంటే తనకు ఎయిర్‌పోర్టులో( Airport) సహాయం చేయడానికి ఇండిగో సిబ్బంది తీసుకున్న సమయమే ఎక్కువంటూ చురకలంటించారు.
ఈ మేరకు ఆమె ఇండిగో ఎయిర్‌లైన్స్‌ను ట్యాగ్ చేస్తూ వరుస ట్వీట్లు చేశారు.మంచిగా ఉంటే పని అవ్వదు. విమానంలో నా పర్స్ మరిచిపోయి దాని కోసం గేటు బయట 40 నిమిషాలు కూర్చున్నాను. మీ సిబ్బందిలో ఎవరైనా నాకు సహాయం చేస్తారా?’ అని ప్రశ్నిస్తూ మొదట మంచు లక్ష్మి ((Manchu laxmi) ట్వీట్ చేశారు. అయితే, ఈ ట్వీట్లో ఇండిగో ట్విట్టర్ అకౌంట్‌ను కాకుండా తప్పుగా మరో అకౌంట్‌ను ట్యాగ్ చేశారు. ఆ తరవాత ఇండిగో ఎయిర్‌లైన్స్‌ను కరెక్ట్‌గా ట్యాగ్ చేస్తూ మంచు లక్ష్మి మరో ట్వీట్ (Tweet)చేశారు. ‘ఇండిగో సిబ్బంది ఎయిర్‌పోర్టులో నాకు సహాయం చేసిన సమయం కన్నా త్వరగా నేను హైదరాబాద్ (Hyderabad) నుంచి తిరుపతి వచ్చేశాని ఆమె తెలిపారు. అసలు ఒక్క కస్టమర్ సర్వీస్ కూడా లేకుండా ఇండిగో ఎలా నడుస్తోందంటూ ఆమె ప్రశ్నించారు.
బ్యాన్ ఇండిగో’ అని హ్యాష్ ట్యాగ్ జత చేశారు. చివరకు స్పందించిన ఇండిగో అసౌకర్యానికి క్షమాపణ చెప్పింది. తమ మేనేజర్ తో మాట్లాడించినట్టు ట్వీట్ చేసింది. ‘మా మేనేజర్ మీకు సహకరిస్తారు.. మీరు లగేజ్ కలెక్ట్ చేసుకుని ఉంటారని భావిస్తున్నాం. తిరిగి మీరు మా ఫ్లైట్‌లో (Flight) ప్రయాణిస్తారని ఆశిస్తున్నాం’ అని ఇండిగో పేర్కొంది.కొన్ని నెలల క్రితం నటుడు రానా దగ్గుబాటి (Rana Daggubati)సైతం ఇండిగో సిబ్బంది పనితీరుపై అసహనం వ్యక్తం చేశారు. హైదరాబాద్ నుంచి భార్యతో కలిసి బెంగళూరు (Bangalore)వెళ్లిన రానాను ఇండిగో ఇబ్బంది పెట్టింది. రానా టికెట్లు బుక్ చేసుకున్న ఇండిగో విమానం రద్దయ్యింది. దీంతో మరో విమానంలో రానా ఫ్యామిలీకి సీట్లు కేటాయించారు. అయితే, ఆ విమానంలో రానా లగేజ్ రాలేదు. బెంగళూరు ఎయిర్‌పోర్టులో ఇండిగో సిబ్బంది సరిగా స్పందించకపోవడంతో ట్విట్టర్ ద్వారా తన ఆగ్రహాన్ని రానా వ్యక్తపరిచారు.