»Veteran Actress Poonam Kaur Gets Emotional In Womens Day
Poonam Kaur నేను తెలంగాణ బిడ్డనే.. నన్ను వేరు చేయొద్దు: హీరోయిన్ పూనమ్ కౌర్
పూనమ్ వచ్చే ఎన్నికల కోసం సిద్ధమవుతున్నట్లు సమాచారం. బీజేపీ తరఫున హైదరాబాద్ ప్రాంతంలో ఒక చోట పోటీ చసేందుకు ఈ వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తున్నది. ఇప్పటికే బీజేపీతో చర్చలు కొనసాగుతున్నాయని టాక్.
తనను గుర్తించడం లేదని.. ఇతర ప్రాంతం వారని దూరం పెడుతున్నట్లు సినీ నటి పూనమ్ కౌర్ (Poonam Kaur) ఆవేదన చెందింది. కానీ తనది తెలంగాణ (Telangana) అని.. తాను తెలంగాణ బిడ్డనని చెబుతూ భావోద్వేగానికి లోనైంది. అంతర్జాతీయ మహిళా దినోత్సవ (International Women’s Day) కార్యక్రమంలో ఆమె బల్లగుద్ది మరీ తాను తెలంగాణ బిడ్డనని చెప్పుకొచ్చింది. కొందరు తనను ఉద్దేశపూర్వకంగా ఇతర ప్రాంతాల వ్యక్తులుగా భావిస్తున్నారని వాపోయింది. ఈ సందర్భంగా తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ (Tamilisai SoundaraRajan)పై ప్రశంసలు కురిపించింది.
హైదరాబాద్ (Hyderabad)లోని రాజ్ భవన్ (Raj Bhavan)లో సోమవారం సాయంత్రం మహిళా దినోత్సవ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి గవర్నర్ తమిళిసైతో పాటు జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలు ఖుష్బూ (Kushboo) హాజరయ్యారు. గవర్నర్ ప్రసంగం అనంతరం పూనమ్ కౌర్ మాట్లాడుతూ.. ‘నేను పంజాబీ అని.. సిక్కు అని మతం పేరు మీద నన్ను తెలంగాణ నుంచి వేరు చేద్దామని చూస్తున్నారు. తెలంగాణలోనే పుట్టా.. ఇక్కడే పెరిగి పెద్దయ్యా. నేను తెలంగాణ బిడ్డని. నా మతం పేరు చెప్పి దూరం చేయవద్దు. తెలంగాణ వచ్చిన తర్వాత అన్యాయం జరుగుతోంది. సినీ పరిశ్రమలో తెలంగాణ ప్రాంతం వారికి ప్రాధాన్యం కావాలి. సినీ పరిశ్రమలో ఎక్కువగా ముంబై నుంచి వచ్చిన వారికే ప్రాధాన్యం ఇస్తున్నారు’ అని పూనమ్ కౌర్ వాపోయింది. ఈ సందర్భంగా పూనమ్ తాను స్వయంగా రాసిన ఒక కవితను సభికులకు చదివి వినిపించింది.
‘అమ్మాయిలు ఆత్మహత్య చేసుకుంటే తల్లిదండ్రులకు కడుపు కోత మిగులుతుంది. ఆత్మహత్య చేసుకునే పరిస్థితి వస్తే అంతకుముందు ఆ మగాడ్ని చంపేయండి. భరించలేని పరిస్థితి వస్తే కత్తి పట్టడంలో తప్పులేదు. వేధించే మగాళ్లు సింహాలైతే మనం గర్జించే శివంగులం.. ఆడ పులులం’ అని ఆమె కవితలో ఉంది. ఇక గవర్నర్ చేసిన వ్యాఖ్యలకు పూనమ్ మద్దతు పలికింది. రాష్ట్రంలో మహిళలకు భద్రత లేదని.. తనను గౌరవించడం లేదని గవర్నర్ తమిళి సై వ్యాఖ్యలు చేయగా.. వాటికి పూనమ్ కౌర్ వంత పాడింది. అంతగా ఆమెకు ఏం జరిగిందో తెలియడం లేదు. అయితే పూనమ్ వచ్చే ఎన్నికల కోసం సిద్ధమవుతున్నట్లు సమాచారం. బీజేపీ తరఫున హైదరాబాద్ ప్రాంతంలో ఒక చోట పోటీ చసేందుకు ఈ వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తున్నది. ఇప్పటికే బీజేపీతో చర్చలు కొనసాగుతున్నాయని టాక్.