MDK: పట్టణంలోని 15వ వార్డులో నూతనంగా ఏర్పాటు చేసిన బోర్ మోటార్‌ను MLA డా. మైనంపల్లి రోహిత్‌రావు సోమవారం ప్రారంభించారు. వార్డులో తాగునీటి సమస్య తీవ్రంగా ఉందని మున్సిపల్ వైస్ ఛైర్మన్ దొంతి నరేష్ గౌడ్ చేసిన విజ్ఞప్తి మేరకు స్పందించిన ఎమ్మెల్యే వెంటనే ఈ సౌకర్యాన్ని కల్పించారు. ఆయన మాట్లాడుతూ.. ప్రజల అవసరాలకు అనుగుణంగా వసతులు కల్పించేందుకు కృషి చేస్తామని తెలిపారు.