KDP: చాపాడు మండల సర్వసభ్య సమావేశం ఇవాళ ఎంపీపీ లక్షుమయ్య అధ్యక్షతన నిర్వహిస్తున్నట్లు ఇంఛార్జ్ ఎంపీడీవో దివిజా సంపతి తెలిపారు. మండల స్థాయి అధికారులు పూర్తి స్థాయి నివేదికతో హాజరుకావాలని సూచించారు. సర్పంచ్లు, ఎంపీటీసీలు గ్రామాలలో గుర్తించిన సమష్యలను తమ దృష్టికి తీసుకురావాలన్నారు. సమావేశానికి ప్రజా ప్రతినిధులు మాత్రమే హాజరుకావాలని తెలిపారు.