అన్నమయ్య: గాలివీడు మండలంలో పోలీసుల ఆధ్వర్యంలో సౌరశక్తితో పనిచేసే సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. బలిజపల్లి గంగమ్మ గుడి క్రాస్‌లో బేపారి జుబేర్ మహమ్మద్ సహకారంతో ఒక డ్యూయల్ కెమెరా, ఎగువగొట్టివీడు గ్రామంలో పఠాన్ రహమతుల్లా, శివప్ప నాయుడు సహకారంతో మరో రెండు డ్యూయల్ కెమెరాలు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి సహకరించిన దాతలకు గాలివీడు ఎస్సై కృతజ్ఞతలు తెలిపారు.