KDP: జూదం ఆడుతున్న ఆరుగురిని అరెస్ట్ చేసి వారి నుంచి రూ. 26,000 నగదును స్వాధీనం చేసుకున్నట్లు బద్వేల్ రూరల్ సీఐ కృష్ణయ్య తెలిపారు. బద్వేల్ నుంచి మైదుకూరు వెళ్లే రహదారి పక్కన నందిపల్లి గ్రామ పొలాల్లో జూదం ఆడుతున్నట్లు తమకు సమాచారం అందడంతో నిందితులను సోమవారం రాత్రి అదుపులోకి తీసుకుని వారిని కోర్టులో హాజరు పరిచినట్లు తెలిపారు.