ASF: రాజారాం గ్రామానికి చెందిన పూదరి కిరణ్ (32) ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసుల వివరాలు ప్రకారం.. కిరణ్- సరిత వివాహం చేసుకున్న కాడినుంచి తాగి వచ్చి భార్యతో తరచూ గొడవపడేవాడని స్థానికులు తెలిపారు. దీంతో ఆమె 3 నెలల క్రితం పుట్టింటికి వెళ్లిందని, ఈ క్రమంలో మనస్తాపానికి గురైన కిరణ్ ఆదివారం రాత్రి ఇంట్లో ఊరేసుకున్నట్లు తెలిపారు. మృతుడి తల్లి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశామన్నారు.