NGKL: అమ్రాబాద్(మం) మన్ననూరులో బుధవారం చెట్టు పైనుంచి పడి చెంచు యువకుడు కాళిదాసు(32) మృతి చెందాడు. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల మేరకు మృతుడు కొబ్బరికాయల నిమిత్తమై చెట్టు పైకి ఎక్కి జారిపడి మృతి చెందినట్లు తెలిపారు. చెట్టు పైకి ఎక్కించిన యజమానిపై చర్యలు తీసుకొని బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని కుటుంబ సభ్యులు డిమాండ్ చేశారు.