TG: రాష్ట్ర ప్రజలకు చల్లటి కబురు అందింది. ఎండలు దంచికొడుతున్న తరుణంలో అకాల వర్షాలు పడతాయని వాతావరణ శాఖ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ నెల 16 నుంచి 23 వరకు దాదాపు వారం రోజుల పాటు అకాల వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వెల్లడించారు. ఉరుములతో కూడిన వడగళ్ల వర్షం పడే ప్రమాదం కూడా ఉన్నట్లు తెలిపారు.