KKD: కోటనందూరు(మం) కాకరపల్లి శివారు చెరువులో సోమవారం లభ్యమైన మృతదేహాలను నర్సీపట్నం ప్రాంతానికి చెందిన భాగ్యలక్ష్మి(35), ఆమె కుమారుడు సాయి(3)గా పోలీసులు గుర్తించారు. కుటుంబ కలహాల వల్ల భాగ్యలక్ష్మి కుమారుడితో సహా ఆత్మహత్య చేసుకున్నట్లు అనుమానిస్తున్నారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు CI చెన్నకేశవరావు తెలిపారు.