JGL: కోరుట్లలో భార్యను వేధింపులకు గురిచేసి ఆత్మహత్యకు ప్రేరేపించిన భర్తకు మెట్పల్లి అసిస్టెంట్ సెషన్స్ జడ్జిడి. నాగేశ్వరరావు ఐదేళ్ల కఠిన కారాగార శిక్ష విధించారు. గంధం స్వామి మద్యానికి బానిసై భార్య లక్ష్మిని తరచూ వేధించేవాడు. కూలి డబ్బుల గొడవలో “పోయి చచ్చిపో” అంటూ ప్రేరేపించడంతో లక్ష్మి నిప్పంటించుకుని మృతి చెందింది. కోర్టు జైలు విధించింది
MDK: తూప్రాన్ పట్టణంలో నిర్వహించిన డ్రంకెన్ డ్రైవ్‌లో పట్టుబడిన చైతన్యకు రూ. 10 వేల జరిమానా విధిస్తూ మొబైల్ కోర్టు న్యాయమూర్తి సాయి ప్రభాకర్ తీర్పు ఇచ్చినట్లు తూప్రాన్-2 ఎస్సై యాదగిరి తెలిపారు. మద్యం సేవించి వాహనాలు నడిపితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మద్యం సేవించి వాహనాలు నడిపి ప్రమాదాలకు కారణం కారాదన్నారు.
NLG: క్యాన్సర్ మహమ్మారిపై యుద్ధానికి జిల్లా సిద్ధమైంది. ఇప్పటికే 3,600 HPV వ్యాక్సిన్ యూనిట్లు చేరుకోవడంతో ఆడబిడ్డల ఆరోగ్య రక్షణకు గట్టి పునాది పడింది. మహిళల పాలిట శాపంగా మారిన గర్భాశయ ముఖద్వార క్యాన్సర్‌ను అడ్డుకునేందుకు 14 నుంచి 15 ఏళ్ల వయసున్న సుమారు 20 వేల మంది కిశోర బాలికలకు ఈ టీకాలను ప్రభుత్వం ఉచితంగా అందించనుంది.
BHPL: టేకుమట్ల(M)లోని బోర్నపల్లి-కిష్టంపేట గ్రామాల మధ్య ఉన్న చలివాగు పై కొంతమంది అక్రమార్కులు టోల్ టాక్స్ పేరిట అక్రమంగా డబ్బులు వసూలు చేస్తున్నారని MRPS టీఎస్ జిల్లా అధ్యక్షులు రాజయ్య మాదిగ ఆరోపించారు. ఎలాంటి అనుమతులు లేకుండా చలివాగులో రోడ్డు నిర్మించి, దాని మీదుగా వెళ్లే వాహనదారుల నుంచి టోల్ టాక్స్ పేరిట డబ్బులు వసూలు చేస్తున్నారని తెలిపారు.
NLG: అధిక శబ్దం కలిగించే ద్విచక్ర వాహనాల మాడిఫైడ్ సైలెన్సర్లను పోలీసులు ధ్వంసం చేశారు. బుధవారం నల్లగొండ పట్టణంలో జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో ట్రాఫిక్ నిబంధనల అమలు, శబ్ద కాలుష్యం, వాయు కాలుష్యం నియంత్రణలో భాగంగా పర్యావరణ రక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని అడిషనల్ ఎస్పీ రమేష్ తెలిపారు.
SDPT: హుస్నాబాద్ పట్టణంలో ‘అరైవ్ అలైవ్’ కార్యక్రమం భాగంగా మల్లె చెట్టు చౌరస్తా వద్ద ట్రాఫిక్ ఎస్సై వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో వాహనదారులకు అవగాహన కల్పించారు. లైసెన్స్ తప్పనిసరిగా కలిగి ఉండాలని, హెల్మెట్ ధరించాలని సూచించారు. మద్యం సేవించి వాహనాలు నడపవద్దని హెచ్చరించారు. కార్యక్రమంలో ట్రాఫిక్ పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
WNP: శ్రీరంగాపురం మండల కేంద్రంలోని కస్తూరిబా గాంధీ బాలికల పాఠశాలలో రూ.88 లక్షల వ్యయంతో చేపట్టనున్న అదనపు మౌలిక సదుపాయాల నిర్మాణ పనులకు ఎమ్మెల్యే మెగారెడ్డి శంకుస్థాపన చేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విద్యార్థులపై ప్రత్యేక దృష్టి సారించినట్లు ఆయన తెలిపారు. విద్యార్థులు శ్రద్ధతో చదువుతూ ఉన్నత స్థానాలను అధిరోహించాలని అన్నారు.
KMR: జిల్లా కేంద్రంలోని NGO కాలనీలో ఈ నెల 10న ఉచిత మెగా ఆరోగ్య వైద్య శిబిరం ఏర్పాటు చేస్తున్నట్లు 14వ వార్డ్ కౌన్సిలర్ రాంశెట్టి హర్షిత తెలిపారు. ప్రజా పాలన- ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా ఆయుష్ దినోత్సవం వేడుకలు NGO కాలనీలో ఆయుష్ కార్యాలయం ఆవరణలో ఉదయం 6:30 గంటల నుంచి 7:30 గంటల వరకు ఉచిత మెగా ఆరోగ్య వైద్య శిబిరం నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
KNR: ప్రాథమిక పాఠశాలల్లో విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలను మెరుగుపరచడమే లక్ష్యంగా పనిచేయాలని కరీంనగర్ అదనపు కలెక్టర్, డీఈవో డా. అశ్విని తానాజీ వాకిడే ఆదేశించారు. ఎంఈవోలు, హెచ్ఎంలతో నిర్వహించిన సమీక్షలో ఎఫ్ఎల్ఎన్ (FLN), ఎల్బాపీ (LIP) పురోగతిని విశ్లేషించారు. తెలుగు, ఆంగ్ల భాషల్లో పఠన నైపుణ్యాలు, గణితంలో యాక్షన్ ప్లాన్ రూపొందించాలన్నారు.
SRD: పటాన్‌చెరు CSR నిధుల దారిమళ్లింపుపై ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. నిధుల గోల్మాల్‌పై ‘హిట్ టీవీ’ వరుస కథనాలు, మేధావుల ఫోరం ఆరోపణలతో స్పందించిన ఆయన బుధవారం కలెక్టర్‌ను కలిశారు. “కాలుష్యం మాకు.. నిధులు పక్క నియోజకవర్గాలకా?” అని నిలదీస్తూ, స్థానిక నిధులను ఇక్కడి అభివృద్ధికి మాత్రమే వాడాలని డిమాండ్ చేశారు.
HNK: కమలాపూర్ మండలం అంబాల గ్రామంలో NSUI నాయకులు హనుమాన్ ప్రసాద్ సోదరి వివాహ మహోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ వివాహ మహోత్సవానికి ముఖ్యఅతిథిగా వ్యవసాయ మార్కెట్ కమిటీ ఛైర్మన్ తౌటం ఝాన్సీరాణి రవీందర్, కాంగ్రెస్ నాయకులు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. అనంతరం నూతన వధూవరులకు బహుమతి అందజేశారు.
RR: గచ్చిబౌలి గోపనపల్లిలోని రంగనాథ స్వామి ఆలయం పక్కన గల ఇస్కాన్ దేవాలయంలో నిత్య ఉచిత బ్రేక్ ఫాస్ట్ సేవను మాజీ కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి ప్రారంభించారు. ప్రతిరోజూ ఉదయం 09:00 నుంచి 10:30 గంటల వరకు భక్తులకు, పేదలకు, స్థానికులకు ఈ పోషకాహార అల్పాహారం అందించబడుతుందని నిర్వాహకులు తెలిపారు. పేదల ఆకలి తీర్చడమే ధ్యేయంగా ఇస్కాన్ ట్రస్టు ఈ కార్యక్రమం చేపట్టారు.
VKB: తాండూరు పట్టణంలోని సర్వే నంబర్ 111లో గల విజయ విద్యాలయ ప్రభుత్వ పాఠశాల భూమిలో షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణం చేపట్టడంపై బీఆర్ఎస్ కౌన్సిలర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం 12 మంది కౌన్సిలర్లతో కలిసి మున్సిపల్ కమిషనర్, ఆర్డీఓ, ఎమ్మార్వోలకు ఫిర్యాదు చేశారు. విద్యాసంస్థల భూములను అక్రమంగా కబ్జా చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
కామారెడ్డి జిల్లా దేవునిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఇలిచిపురి శివారులో జాతీయ రహదారిపై నేడు ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. విజయనగరం జిల్లా నుంచి బాసరకు వెళ్తున్న ట్రావెల్స్ బస్సును నిలిపిన సమయంలో రోడ్డు పక్కన ఉన్న కడియాల రమణమ్మ(55)ను కారు వేగంగా వచ్చి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆమె అక్కడికక్కడే మృతి చెందారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు SI తెలిపారు
WNP: అంగన్వాడి కేంద్రాలు గ్రామీణ ప్రాంతాల్లో మహిళలు, చిన్నారులకు ముఖ్యమైన సేవలు అందిస్తున్నాయని ఎమ్మెల్యే మెగారెడ్డి తెలిపారు. అంగన్వాడీలకు 538 కొత్త 5జీ స్మార్ట్ ఫోన్లను ఆయన అందజేశారు. అంగన్వాడీ టీచర్లు కూడా ఈ సదుపాయం కల్పించినందుకు ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు. మొబైల్ ఫోన్ల ద్వారా తమ విధులు మరింత సులభంగా నిర్వహించగలమని వారు పేర్కొన్నారు.