• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

‘ప్రమాదం జరగకముందే చర్యలు తీసుకోవాలి’

VKB: బంట్వారం మండలంలోని సుల్తాన్‌పూర్ గ్రామం నుంచి కొత్తపల్లికి వెళ్లే రహదారిపై మధ్యలో పెద్ద గుంత ఏర్పడడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా రాత్రి సమయంలో ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు, గ్రామపాలకులు వెంటనే చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు.

April 11, 2026 / 07:17 AM IST

’18 మందికి రూ.1,83,500 జరిమానా’

SDPT: జిల్లాలో ట్రాఫిక్ పోలీసులు నిర్వహించిన తనిఖీల్లో మద్యం సేవించి వాహనాలు నడిపిన 18 మందిని పట్టుకున్నారు. వారిని కోర్టులో హాజరుపరచగా స్పెషల్ సెకండ్ క్లాస్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ కాంతారావు రూ.1,83,500 జరిమానా విధించారు. డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనం నడిపిన ముగ్గురికి రూ.15వేలు జరిమానా విధించారు. డ్రంక్ అండ్ డ్రైవ్ ప్రమాదకరమని, నియమాలు పాటించాలన్నరు.

April 11, 2026 / 07:14 AM IST

ఎమ్మెల్యేకు వెంకటేశ్వర స్వామి ఆహ్వాన పత్రిక అందజేత

SRCL: ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల బొప్పాపూర్‌లోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రతిష్ఠ, కళ్యాణ మహోత్సవ వేడుకలకు హాజరుకావాలని కరీంనగర్ డీసీసీ అధ్యక్షుడు, చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యంను ఆలయ కమిటీ సభ్యులు ఆహ్వానించారు. ఈ మేరకు ఆయనకు వారు ఆహ్వాన పత్రిక అందజేశారు. నిత్యం ధూప దీప నైవేద్యాలకు అవసరమయ్యే ఏర్పాట్లు చూస్తానని హామీ ఇచ్చారు.

April 11, 2026 / 07:09 AM IST

కందకుర్తిలో మోహన్ భగవత్ పర్యటన.. భారీ భద్రత

NZB: రెంజల్ మండలం కందకుర్తిలో నేడు కేశవ స్ఫూర్తి మందిర ప్రారంభోత్సవానికి ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్ రానున్నారు. ఈ నేపథ్యంలో సీపీ సాయి చైతన్య భద్రతా ఏర్పాట్లను సమీక్షించారు. 400 మంది పోలీసులు, కేంద్ర బలగాలు, క్యూఆర్టీ బృందాలతో పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు. నిఘా కోసం సీసీ కెమెరాలు, ట్రాఫిక్ క్రమబద్ధీకరణకు ప్రత్యేక చర్యలు తీసుకున్నారు.

April 11, 2026 / 07:08 AM IST

సిరికొండలో పర్యటించిన ఆదిలాబాద్ ఎంపీ నగేశ్

ADB: సిరికొండ మండలంలోని సోంపల్లి గ్రామంలో ఆదిలాబాద్ పార్లమెంటు సభ్యుడు గోడం నగేశ్ శుక్రవారం సాయంత్రం పర్యటించారు. ఇటీవల రోడ్డు ప్రమాదంలో మరణించిన పలువురు బాధిత కుటుంబాలను ఎంపీ పరామర్శించి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. కుటుంబ సభ్యులతో మాట్లాడి మనోధైర్యంతో ఉండాలని సూచించారు. ఎంపీ వెంట బీజేపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు ఉన్నారు.

April 11, 2026 / 07:07 AM IST

HIV రాకున్నా.. సూటిపోటి మాటలు చంపాయి.!

HYD: మేడ్చల్ జిల్లాలో HIV ఉన్న మనోహర్ అనే యువకుడు, తన పెళ్లిని నిరాకరించిందని ప్రియురాలికి బలవంతంగా తన రక్తాన్ని ఎక్కించాడు. పరీక్షల్లో ఆమెకు నెగిటివ్ వచ్చినప్పటికీ, సమాజం నుంచి ఎదురైన సూటిపోటి మాటలు, అవమానాలను తట్టుకోలేక ఆ యువతి లేఖ రాసి ఆత్మహత్య చేసుకుంది. “అమ్మా క్షమించు.. గౌరవం పోయాక బతకలేను” అంటూ ఆమె రాసిన ఆఖరి మాటలు అందరినీ కలచివేస్తున్నాయి.

April 11, 2026 / 07:07 AM IST

‘రామన్నపేట నియోజకవర్గంను పునరుద్దరించాలి’

BHNG: గతంలో రద్దయిన రామన్నపేట నియోజకవర్గంను పునరుద్ధరించాలని, నియోజకవర్గాల పునర్విభజనలో రామన్నపేటకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని మండల అఖిలపక్ష పార్టీలు డిమాండ్ చేశాయి. కాంగ్రెస్, CPM, BJP, BRS పార్టీల ఆధ్వర్యంలో శుక్రవారం స్థానిక రహదారి బంగళాలో అఖిలపక్ష పార్టీల సమావేశం కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు సింగిరెడ్డి మండలారెడ్డి అధ్యక్షతన నిర్వహించారు.

April 11, 2026 / 07:06 AM IST

ఇసుక మాఫియా పై పోలీసులకు ఉక్కు పాదం

NRML: జిల్లాలో ఇసుక అక్రమ రవాణాపై పోలీసులు కఠిన చర్యలు చేపట్టారు. సారంగపూర్, లోకేశ్వరం, బాసర, భైంసా తదితర ప్రాంతాల్లో శుక్రవారం సాయంత్రం ప్రత్యేక బృందాలతో దాడులు నిర్వహించి ట్రాక్టర్లు, టిప్పర్లను స్వాధీనం చేసుకున్నారు. పలువురిపై కేసులు నమోదు చేశారు. ఇసుక దందాను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని ఎస్పీ జానకి షర్మిల హెచ్చరించారు.

April 11, 2026 / 07:05 AM IST

బెదిరించి అత్యాచారం… వ్యక్తి అరెస్ట్

KNR: పరిచయాన్ని ఆసరాగా చేసుకుని వివాహితపై అత్యాచారానికి పాల్పడిన అక్షయ్ కుమార్‌‌ను కరీంనగర్ రూరల్ పోలీసులు అరెస్ట్ చేశారు. తీగలగుట్టపల్లిలో ఒంటరిగా ఉంటున్న బాధితురాలిని నిందితుడు ఫోటోలతో బ్లాక్ మెయిల్ చేస్తూ, చంపుతానని బెదిరించి లొంగదీసుకున్నాడు. వేధింపులు భరించలేక ఆమె ఫిర్యాదు చేయడంతో, పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలించినట్లు CI తెలిపారు.

April 11, 2026 / 07:05 AM IST

ఈనెల 19న మోడల్ స్కూల్ ప్రవేశ పరీక్ష

PDPL: ఈనెల 19న 2026 -27 విద్యా సంవత్సరానికి ధర్మారం మోడల్ స్కూల్లో ప్రవేశ పరీక్ష నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపల్ రాజ్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. 6వ తరగతి ప్రవేశం కోసం ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12 వరకు, 7 నుంచి 10 తరగతుల కోసం మధ్యాహ్నం 2 నుంచి 4 గంటల వరకు పరీక్ష ఉంటుందని పేర్కొన్నారు. విద్యార్థులు హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకోవాలని తెలిపారు.

April 11, 2026 / 07:05 AM IST

అధిక శబ్దంతో సైలెన్సర్లు బిగిస్తే కఠిన చర్యలు

NRPT: జిల్లాలో ద్విచక్ర వాహనాలకు అధిక శబ్దం వచ్చే సైలెన్సర్లు బిగిస్తే చర్యలు తప్పవని ట్రాఫిక్ ఎస్సై కృష్ణచైతన్య హెచ్చరించారు. శుక్రవారం పట్టణంలోని పలు కూడళ్లలో తనిఖీలు చేపట్టి, నిబంధనలు ఉల్లంఘించిన వారికి జరిమానా విధించారు. ఇటువంటి సైలెన్సర్ల వల్ల శబ్ద కాలుష్యం పెరిగి పాదచారులకు ఇబ్బంది కలుగుతుందని తెలిపారు. వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని సూచించారు.

April 11, 2026 / 07:03 AM IST

ఆస్తి ప‌న్ను వ‌సూళ్లు, ట్రేడ్ లైసెన్సుల‌పై ప్ర‌త్యేక దృష్టి

నల్ల‌గొండ మున్సిప‌ల్ కార్పొరేషన్ పరిధిలో ఆస్తి పన్ను వసూళ్లు, ట్రేడ్ లైసెన్సులపై ప్రత్యేక దృష్టి సారించిన‌ట్లు కమిషనర్ బ‌చ్చ‌ల‌కూరి శ‌ర‌త్‌చంద్ర తెలిపారు. నగర అభివృద్ధికి అవసరమైన ఆదాయ వనరులను బలోపేతం చేయడం అత్యంత అవసరమన్నారు. ఈ సందర్భంగా కమిషనర్ నగరంలోని వ్యాపారులు, ఆస్తి యజమానులను ఉద్దేశించి మాట్లాడారు.

April 11, 2026 / 07:01 AM IST

రోడ్డు భద్రతపై ఐదు రోజుల ప్రత్యేక డ్రైవ్

JGL: జిల్లాలో రోడ్డు ప్రమాదాల నియంత్రణ లక్ష్యంగా “Arrive Alive” అవగాహన కార్యక్రమాలను ఏప్రిల్ 13–18 వరకు నిర్వహించనున్నట్లు ఎస్పీ అశోక్ కుమార్ తెలిపారు. రోడ్ సేఫ్టీ కమిటీలు, విద్యార్థులకు ట్రాఫిక్ అవగాహన, సోషల్ మీడియా ప్రచారం చేపడతారు. “గోల్డెన్ అవర్” శిక్షణ, చివరి రోజు కౌన్సెలింగ్ ద్వారా మార్పు తీసుకురావడంపై దృష్టి సరిస్తారని పేర్కొన్నారు.

April 11, 2026 / 07:01 AM IST

ఇంటర్మీడియట్లో కొత్తగా ఏసీఈ గ్రూపు!

WNP: వచ్చే విద్యా సంవత్సరం (2026-27) నుంచి ఇంటర్‌లో ACE (అకౌంటెన్సీ, కామర్స్, ఎకనామిక్స్) గ్రూపును ప్రవేశ పెడుతున్నట్లు DIEO ఎర్ర అంజయ్య తెలిపారు. కోర్సు నిర్వహించాలనుకునే కళాశాలలు వెంటనే ఇంటర్ బోర్డుకు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. కొత్త కోర్సుపై విద్యార్థులకు విస్తృత ప్రచారం కల్పించాలని ప్రిన్సిపాల్లను ఆదేశించారు.

April 11, 2026 / 07:00 AM IST

నేతువానిపల్లి శివారులో చిరుత దాడి: లేగదూడ మృతి

GDWL: జిల్లా నేతువానిపల్లి శివారులో చిరుత దాడిలో ఒక లేగదూడ మృతి చెందింది. ఘటనా స్థలాన్ని FRO పర్వేజ్ అహ్మద్ సందర్శించి, పాదముద్రలను ధృవీకరించారు. రైతులు ఒంటరిగా పొలాలకు వెళ్లవద్దని, అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. వన్యప్రాణులకు హాని తలపెట్టవద్దని, రక్షణ చర్యలు చేపడతామని ఉన్నతాధికారులకు నివేదించారు.

April 11, 2026 / 06:50 AM IST