VKB: బంట్వారం మండలంలోని సుల్తాన్పూర్ గ్రామం నుంచి కొత్తపల్లికి వెళ్లే రహదారిపై మధ్యలో పెద్ద గుంత ఏర్పడడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా రాత్రి సమయంలో ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు, గ్రామపాలకులు వెంటనే చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు.