WNP: ఎండు తీవ్రతతో జిల్లాలో విద్యుత్తు వినియోగం పెరిగింది. అధికలోడు కారణంగా సరఫరాలో అంతరాయం ఏర్పడుతోంది. పునరుద్ధరణకు సరఫరా నిలిపి మరమ్మతులు చేస్తుండటంతో అప్రకటిత కోతలు తలెత్తుతున్నాయి. జిల్లాలో 15రోజుల కిందట రోజూ విద్యుత్తు వినియోగం 230 మెగావాట్లు ఉండేది. ప్రస్తుతం ఎండల తీవ్రతతో వినియోగం 46 మెగావాట్లు పెరిగి 276కు చేరింది.
ADB: ఉట్నూర్ మండలంలోని చిన్నుగూడకు చెందిన శనివారం రాత్రి చౌకటి శ్రీకాంతాబాయికి పురిటి నొప్పులు రావడంతో 108కి సమాచారం అందించారు. ఈ మేరకు ఆమెను రిమ్స్ ఆస్పత్రికి తరలిస్తున్న క్రమంలో మార్గమధ్యంలోనే బిడ్డకు జన్మనిచ్చినట్లు ఈఎంటీ (EMT) దత్తాత్రేయ, పైలట్ రవీందర్ తెలిపారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం తల్లి, బిడ్డను 108 వాహనంలో రిమ్స్ ఆస్పత్రికి తరలించారు.
NLG: పేదలకు పంపిణీ చేయాల్సిన రేషన్ బియ్యం పక్కదారి పడుతున్నాయి. అధికారులు ఎన్ని చర్యలు తీసుకున్నప్పటికీ కొందరు రేషన్ డీలర్లు సన్న బియ్యాన్ని బ్లాక్ మార్కెట్కు తరలిస్తున్నారు. చండూరు మండలం తుమ్మలపల్లిలో శనివారం 8 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని పట్టుకున్నారు. కురుపాటి సురేశ్ అనే వ్యక్తి ఇంట్లో తనిఖీలు చేసి 8 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని గుర్తించారు.
JGL: మత్తు పదార్థాల నిర్మూలనకు సమిష్టి కృషి అవసరమని జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ అన్నారు. 99 రోజుల ‘ప్రజా పాలన-ప్రణాళిక’లో భాగంగా ఎమ్మెల్యే సంజయ్ కుమార్‌తో కలిసి ప్రభుత్వ ఆసుపత్రిలోని డీ-అడిక్షన్ సెంటర్‌ను సందర్శించారు. డ్రగ్స్ సమస్య సామాజిక, ఆరోగ్య సమస్యగా మారిందని పేర్కొన్నారు. ఎస్పీ మాట్లాడుతూ.. యువత చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని సూచించారు.
VKB: కుల్కచర్ల ప్రభుత్వ ఆసుపత్రిలో శనివారం ముగ్గురు యువకులు మద్యం మత్తులో హంగామా సృష్టించారు. 108 అంబులెన్స్ అద్దాలను పగలగొట్టడమే కాకుండా, విధుల్లో ఉన్న డ్రైవర్, సిబ్బందిపై విచక్షణారహితంగా దాడి చేసి దుర్భాషలాడారు. యువకులపై డ్రైవర్ కుల్కచర్ల పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని సిబ్బంది కోరుతున్నారు.
RR: కాటేదాన్‌లో గంజాయి చాక్లెట్లు విక్రయిస్తున్న ఓ మహిళను ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు అరెస్ట్ చేశారు. శనివారం నిర్వహించిన దాడుల్లో ఆమె వద్ద నుంచి 870 గ్రాముల గంజాయి చాక్లెట్లు, సెల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఈ మత్తు పదార్థాలను బీహార్ రాష్ట్రం నుంచి తీసుకువచ్చినట్లు నిందితురాలు అంగీకరించింది. పట్టుబడిన సొత్తుతో పాటు ఆమెను శంషాబాద్ పోలీసులకు అప్పగించారు.
MDCL: ఉప్పల్ రింగ్ రోడ్డు వద్ద సెంట్రల్ పిల్లర్ నిర్మాణాల కోసం ఇంజనీర్లు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. ఈ పనులు ప్రారంభమైతే ఉప్పల్ రింగ్ రోడ్డు బంద్ కానుంది. ఉప్పల్ నుంచి నారపల్లి వరకు నిర్మించనున్న ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణపు పనుల్లో భాగంగా ఈ చర్యలు చేపడుతున్నారు. AE నరేష్ మాట్లాడుతూ.. రాబోయే నెల రోజుల్లో ట్రాఫిక్ డైవర్షన్ చర్యలు ఉంటాయన్నారు.
KMM: బోనకల్‌లో గంజాయి రవాణా కేసులో నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. శనివారం అండర్ రైల్వే బ్రిడ్జి వద్ద కృష్ణుడి గుడి సమీపంలో నిర్వహించిన తనిఖీల్లో అనుమానాస్పదంగా తిరుగుతున్న రవిరాజును పట్టుకుని, అతని వద్ద నుంచి 2.4 కిలోల గంజాయి, బైక్, మొబైల్ స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి నిందితుడిని రిమాండ్‌కు తరలించామని పోలీసులు తెలిపారు.
BHPL: కాటారం(M) కేంద్రంలో నిర్మిస్తున్న ఇండోర్ స్టేడియం పనులు నత్తనడకన సాగడంపై జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ అసంతృప్తి వ్యక్తం చేశారు. శనివారం సైట్‌ను పరిశీలించిన ఆయన, రాబోయే వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకొని త్వరితగతిన పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. నిర్మాణానికి అవసరమైన నిధులను వెంటనే మంజూరు చేస్తామని, గుత్తేదారు పనులను వేగవంతం చేయాలన్నారు.
JN: జనగామ పట్టణంలో డీసీపీ రాజమహేందర్ నాయక్ ఆధ్వర్యంలో గ్రామాల సర్పంచులు, ఉపసర్పంచులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రతి గ్రామంలో సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేయాలని సూచించారు. సీసీటీవీల ద్వారా గ్రామ భద్రత బలోపేతం అవుతుందని, నేరాల నియంత్రణతో పాటు దొంగతనాలను నివారించడంలో ఇవి కీలకంగా ఉపయోగపడతాయని తెలిపారు.
NZB: జిల్లాలో ఈ ఏడాది ఇంటర్ ఫలితాలు ఆదివారం ఉ. 11 గంటలకు విడుదల కానున్నాయి. ఈ నేపథ్యంలో విద్యార్థుల్లో ఉత్కంఠ నెలకొంది. మొత్తం 36,963 మంది విద్యార్థులు ఇంటర్ పరీక్షలకు హాజరయ్యారు. వీరిలో ఫస్ట్ ఇయర్ 19,299 మంది, సెకండ్ ఇయర్ 17,664 మంది విద్యార్థులున్నారు. ఫలితాలను HIT TV యాప్‌లో చూడవచ్చు.
MBNR: బాలానగర్ మండలం వీరన్నపల్లిలో శనివారం రాత్రి మహబూబ్ నగర్ సురక్ష పోలీస్ బృందం ఆధ్వర్యంలో ‘ప్రజాభద్రత-పోలీస్ బాధ్యత’ కార్యక్రమం నిర్వహించారు. ఎస్సై లెనిన్ మాట్లాడుతూ.. వర్గ పోరు సమాజ అభివృద్ధికి ఆటంకమని, అసాంఘిక శక్తుల పట్ల పోలీసులు ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉంటారని పేర్కొన్నారు. అనంతరం బాల్య వివాహాలు, సైబర్ నేరాలపై గ్రామస్తులకు అవగాహన కల్పించారు.
KMR: ఎల్లారెడ్డి మండల కేంద్రానికి చెందిన ఆత్మకూరి నవీన్ కుమార్ అనారోగ్యంతో చికిత్స నిమిత్తం ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు చొరవతో రూ.75,000 ముఖ్యమంత్రి సహాయ నిధి మంజూరైంది. శనివారం ఈ ఆర్థిక సాయానికి సంబంధించిన పత్రాలను బాధిత కుటుంబానికి అందజేశారు. అనారోగ్యంతో బాధపడుతున్న తమకు ఈ సాయం ఎంతో ఊరటనిచ్చిందని నవీన్ కుమార్ కుటుంబ సభ్యులు పేర్కొన్నారు.
BDK: నిర్దేశిత గడువులోగా అన్ని భూభారతి దరఖాస్తులను పరిష్కరించాలని కలెక్టర్ అంకిత్ తాహసీల్దార్‌లకు సూచించారు. ఎస్‌ఐఆర్ మ్యాపింగ్, డిలీషన్ ప్రక్రియను నిబంధనలకు అనుగుణంగా చేపట్టాలన్నారు. మరణించిన వ్యక్తుల పేర్ల తొలగింపు, నోటీసులు జారీ చేసి, సరైన ధ్రువీకరణ అనంతరమే చర్యలు తీసుకోవాలన్నారు. అటవీ, రెవెన్యూ, భూ సమస్యలపై సమగ్ర నివేదికలను సిద్ధం చేయాలని ఆదేశించారు.
NZB: జిల్లా రైతులకు భారీ ఊతమిచ్చే జకోరా, చందూర్, చింతకుంట లిఫ్ట్ ఇరిగేషన్ పథకం తుదిదశకు చేరుకుంది. ఈ పథకాన్ని త్వరలో ప్రారంభించి ఖరీఫ్ సీజన్‌కు ముందే సాగునీరు అందించనున్నట్లు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. రూ.106.04 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన ఈ ప్రాజెక్టు ద్వారా వర్ని, చందూర్, మోస్రాలోని 7,975 ఎకరాలకు సాగునీరు అందనుంది.