మహబూబాబాద్ (Mahbubabad), ఖమ్మం, వరంగల్, కరీంనగర్ జిల్లాల్లో ఇటీవల అకాల వర్షాలతో దెబ్బతిన్న పంటలను సీఎం కేసీఆర్ (CM KCR) క్షేత్రస్థాయిలో పరిశీలించారు. కరీంనగర్ జిల్లా లక్ష్మీపూర్‌లో(Lakshmipur) పంటలను పరిశీలించారు. అకాల వర్షాలతో పంట నష్టపోయిన కౌలు రైతులను సైతం ఆదుకుంటామని సీఎం భరోసా కల్పించారు. రాష్ట్రవ్యాప్తంగా అకాల వర్షాలకు (Akala varsalaku) దెబ్బతిన్న పంటలకు ఎకరానికి రూ.10వేలు అందించనున్నట్లు సీఎం కేసిఆర్ వెల్లడించారు. ఇప్పటికే ప్రభుత్వం నిధులు విడుదలకు సంబంధించిన జీవో జారీ చేసిందన్నారు. పంట నష్టం దెబ్బతిందని రైతులు (Farmers) నిరుత్సాహం పడొద్దని ఆయన సూచించారు. రాష్ట్ర జీడీపీ (GDP) పెరుగుతున్నది. ప్రజలకు పని దొరకుతుంది. పల్లెలన్నీ సుఖ సంతోషాలతో ఉన్నాయి. కాబట్టి ఆ పరిస్థితిని వెనక్కి పోనివ్వొద్దు. ఎట్టి పరిస్థితుల్లో ఆత్మస్థయిర్యం కోల్పోవద్దన్నారు. మీ వెంట కేసీఆర్, రాష్ట్ర ప్రభుత్వం (State Govt) సంపూర్ణంగా ఉంటుందని ఆయన తెలిపారు.
ప్రకృతి వైపరీత్యాలు వచ్చిన సందర్భంలో తట్టుకోవాలి తప్పా.. మనసు చిన్నబుచ్చుకొని నారాజ్ కావొద్దు. ఇంకా బలంగా పని చేస్తూ ముందుకుపోవాలి. పంట సాయానికి సంబంధించి సీఎస్ జీవో సైతం జారీ చేశారు. త్వరలోనే రైతులందరికీ డబ్బులు వస్తాయ్. మర్పల్లిలో వడగళ్లు భారీగా కురిశాయి. ఖమ్మం(Khammam) ,కరీంనగర్, వరంగల్ కొన్ని జిల్లాల్లో నష్టం జరిగింది. జగిత్యాలలోనూ నష్టం జరిగిందని మంత్రి కొప్పుల ఈశ్వర్ (Minister Koppula) ఎమ్మెల్యే తెలిపారు. ఎక్కడ నష్టం జరిగినా ఆదుకుంటామన్నరు. ఉజ్వలమైన తెలంగాణ వ్యవసాయ రంగం.. ఎందుకు పరిహారం పెంచి ఇస్తున్నామంటే.. రైతాంగం నారాజ్ కావొద్దని.. తెలంగాణలో (Telangana) వ్యవసాయరంగానికి సంతరించబడిన స్థితి ఎట్టిపరిస్థితుల్లో మళ్లీ ముందడుగు వేయాలే తప్ప వెనుకడుగు వేయొద్దని సదుద్దేశంతో ముందుకెళ్తున్నాం. దీన్ని అందిపుచ్చుకొని రైతులోకం గొప్పగా ముందుకురావాలి. ధైర్యం కోల్పోకూడదు’ అంటూ సీఎం కేసీఆర్ (CM KCR) కోరారు
అకాల వర్షాల కారణంగా పంట నష్టపోయిన రైతులకు సీఎం శ్రీ కేసీఆర్ భరోసా ఇచ్చారు. ఎకరానికి 10 వేల చొప్పున నష్టపరిహారం అందజేస్తామని ప్రకటించారు. ఖమ్మం జిల్లా బోనకల్ మండలంలో నష్టపోయిన పంట పొలాలను పరిశీలించిన అనంతరం మీడియాతో మాట్లాడారు. రైతులతో పాటు కౌలు రైతులను కూడా ఆదుకుంటామని చెప్పారు pic.twitter.com/mUydQlrdQX