»Pcc Chief Revanth Reddy House Arrest In Hyderabad
TSPSC paper leak: రేవంత్ రెడ్డి హౌస్ అరెస్ట్, ఉద్రిక్తత
తెలంగాణ పీసీసీ అధ్యక్షులు (Telangana PCC president) రేవంత్ రెడ్డిని (Revanth Reddy) పోలీసులు శుక్రవారం హౌస్ అరెస్ట్ (Revanth Reddy house arrest) చేశారు. టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీని (TSPSC paper leak) నిరసిస్తూ ఉస్మానియా యూనివర్సిటీ (Osmania University), విద్యార్థి సంఘాల జేఏసీ (Students JAC) నిరుద్యోగ మహాదీక్షకు (Nirudyoga Mahadeeksha) పిలుపునిచ్చారు. ఈ నిరసన దీక్షకు రేవంత్ ఇదివరకే మద్దతు ప్రకటించారు.
తెలంగాణ పీసీసీ అధ్యక్షులు (Telangana PCC president) రేవంత్ రెడ్డిని (Revanth Reddy) పోలీసులు శుక్రవారం హౌస్ అరెస్ట్ (Revanth Reddy house arrest) చేశారు. టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీని (TSPSC paper leak) నిరసిస్తూ ఉస్మానియా యూనివర్సిటీ (Osmania University), విద్యార్థి సంఘాల జేఏసీ (Students JAC) నిరుద్యోగ మహాదీక్షకు (Nirudyoga Mahadeeksha) పిలుపునిచ్చారు. ఈ నిరసన దీక్షకు రేవంత్ ఇదివరకే మద్దతు ప్రకటించారు. అయితే ఈ దీక్షకు అనుమతి లేదంటూ పోలీసులు యూవర్సిటీలో విద్యార్థులను అడ్డుకున్నారు. రెండు వైపుల ఉన్న గేట్లను మూసివేసి పలువురు విద్యార్థి నేతలను అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు, రేవంత్ రెడ్డి (Revanth Reddy), కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు (Congress leaders) అటు వైపు వెళ్లకుండా భారీగా పోలీసులు మోహరించారు. జూబ్లీహిల్స్‌లోని రేవంత్ రెడ్డి నివాసానికి (Revanth residence at Jubilee Hills) ఉదయమే చేరుకున్న పోలీసులు.. ఆయనను హౌస్ అరెస్ట్ (House Arrest) చేశారు. ఆయన ఇంటి చుట్టూ భారీగా పోలీసులను మోహరించారు. కార్యకర్తలు రేవంత్ ఇంటి వైపు వెళ్లకుండా అదుపులోకి తీసుకున్నారు. ఆయన ఇంటికి వెళ్లే దారులను మూసివేసారు. దీంతో రేవంత్ నివాసం వద్ద ఉద్రిక్తత నెలకొన్నది.
తనను అడ్డుకోవడంపై, కార్యకర్తలను అరెస్ట్ చేయడంపై రేవంత్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థుల జీవితాలతో ప్రభుత్వం ఆడుకుంటుంటే కనీసం గాంధీ మార్గంలో నిరసన వ్యక్తం చేయడానికి కూడా అనుమతి ఇవ్వరా అని నిలదీశారు. తాను గతంలోనే సవాల్ చేశానని, మరోసారి సీఎం కేసీఆర్ (Chief Minister of Telangana KCR), మంత్రి కేటీఆర్ లకు (IT Minister KTR) సవాల్ చేస్తున్నానని, టీఎస్పీఎస్సీ ప్రశ్నాపత్రాల స్కామ్ పైన ((TSPSC paper leak) ఉస్మానియా విశ్వవిద్యాలయం విద్యార్థుల సమక్షంలో చర్చకు రావాలంటూ ట్వీట్ చేశారు. పోలీసులను పంపించి, తనను గృహ నిర్బంధం చేయడం కాదని, చర్చకు వచ్చే దమ్ముందా అన్నారు. వారిద్దరు సచ్ఛీలురు అయితే స్కాంలో మీ పాత్రలేకపోతే తన సవాల్ ను స్వీకరించాలన్నారు.
మళ్ళి ఒక్కసారి…
🔥పోలీసులను పంపి, నన్ను గృహనిర్భందం చేయడం కాదు… కేసీఆర్ – కేటీఆర్ లకు దమ్ముంటే టీఎస్పీఎస్సీ ప్రశ్నాపత్రాల కుంభకోణం పై ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థుల సమక్షంలో చర్చకు రావాలి.