»Rahuls Disqualification Is An Evil Act Revanth Reddys Comments
Revanth Reddy : రాహుల్‌పై అనర్హత దుర్మార్గం : రేవంత్ రెడ్డి
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పై లోక్‌సభ సెక్రటేరియట్ (Lok Sabha Secretariat) అనర్హత వేటు వేయడంపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి (TPCC Chief Revanth Reddy) ఆగ్రహం వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. రాహుల్‌పై అనర్హత దుర్మార్గమన్నారు. అదానీ (Adani) కుంభకోణంపై చర్చ జరగకుండా బీజేపీ అన్ని రకాల ప్రయత్నం చేస్తోందని... అందులో భాగంగానే రాహుల్‌పై అనర్హత అని ఆయన మండిపడ్డారు. అప్రకటిత ఎమర్జెన్సీ నడుస్తోందన్నారు. ప్రధాని మోదీ (PM Modi) చక్రవర్తిలా వ్యవహరిస్తున్నారని ఆయన విమర్శించారు.
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పై లోక్‌సభ సెక్రటేరియట్ (Lok Sabha Secretariat) అనర్హత వేటు వేయడంపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి (TPCC Chief Revanth Reddy) ఆగ్రహం వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. రాహుల్‌పై అనర్హత దుర్మార్గమన్నారు. అదానీ (Adani) కుంభకోణంపై చర్చ జరగకుండా బీజేపీ అన్ని రకాల ప్రయత్నం చేస్తోందని… అందులో భాగంగానే రాహుల్‌పై అనర్హత అని ఆయన మండిపడ్డారు. అప్రకటిత ఎమర్జెన్సీ నడుస్తోందన్నారు. ప్రధాని మోదీ (PM Modi) చక్రవర్తిలా వ్యవహరిస్తున్నారని ఆయన విమర్శించారు. ఇలాంటి వైఖరి దుర్మార్గమని అన్నారు. కోర్ట్ కూడా 30 రోజులు అప్పీల్‌కు టైం ఇచ్చిందని.. అలాంటప్పుడు అనర్హత వేటు ఎందుకు అని ప్రశ్నించారు.
ప్రధాని మోదీ కాల గర్భంలో కలిసిపోతారని రేవంత్ రెడ్డి (Revanth Reddy) ఆరోపించారు. రాహుల్‌కు తాము అంతా అండగా ఉంటామని తెలిపారు. కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు చేసిన పాదయాత్రలో ప్రభుత్వ వైఫల్యాలను రాహుల్ ఎండగట్టారని.. దాన్ని మోడీ జీర్నుంచుకోలేకపోతున్నారన్నారు. మోదీ కలియుగ నియంతలా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మోదీ ఇంటి పేరు(Modi surname) కలవారందరూ దొంగలే అంటూ వ్యాఖ్యానించి రెండేళ్ల జైలుశిక్ష పొందిన కాంగ్రెస్ పార్టీ ఎంపీ రాహుల్ గాంధీ (Congress MP Rahul Gandhi)పై అనర్హత వేటు పడింది. దీనికి సంబంధించి లోక్‌సభ (Lok Sabha)సెక్రటేరియట్ నుంచి సర్క్యులర్ జారీ అయింది. 1951 ప్రజాప్రాతినిధ్య చట్టం సెక్షన్ 8(3) ప్రకారం ఆయనపై అనర్హత పడింది. సూరత్ కోర్ట్(Surat Court ) తీర్పు ప్రకారం లోక్‌సభ సెక్రటేరియట్ ఆయనపై వెంటనే చర్యలకు దిగింది.