Balagam : ఎలాంటి సినిమా అయినా సరే.. హిట్ అయితే ఓకే, కానీ ఫట్ అయితేనే రెండు, మూడు వారాల్లోనే ఓటిటిలోకి దర్శనమిస్తున్నాయి. ఇక చిన్న సినిమాలైతే.. హిట్ అయినా ఫట్ అయినా మాగ్జిమమ్ మూడు వారాల్లో ఓటిటిలోకి వచ్చేస్తున్నాయి.
ఎలాంటి సినిమా అయినా సరే.. హిట్ అయితే ఓకే, కానీ ఫట్ అయితేనే రెండు, మూడు వారాల్లోనే ఓటిటిలోకి దర్శనమిస్తున్నాయి. ఇక చిన్న సినిమాలైతే.. హిట్ అయినా ఫట్ అయినా మాగ్జిమమ్ మూడు వారాల్లో ఓటిటిలోకి వచ్చేస్తున్నాయి. అందుకు నిదర్శనమే బలగం సినిమా అని చెప్పొచ్చు. ప్రియదర్శి హీరోగా.. కావ్య కళ్యాణ్ రామ్ హీరోయిన్గా.. కమెడియన్ వేణు దర్శకత్వంలో బలగం తెరకెక్కింది. దిల్ రాజు ప్రొడక్షన్స్‌లో దిల్ రాజు కుమార్తె హన్షిత రెడ్డి, హర్షిత్ రెడ్డి ఈ సినిమాను నిర్మించారు. మార్చి 3న రిలీజ్ అయిన ఈ సినిమా.. బాక్సాఫీస్ దగ్గర చిన్న సినిమాల్లో పెద్ద విజయాన్ని అందుకుంది. ఈ సినిమా విడుదలై మూడు వారాలైనా కలెక్షన్స్ విషయంలో ఏ మాత్రం తగ్గడం లేదు. మొత్తంగా 20 కోట్లకు పైగా వసూలు చేసింది. ఇంకా థియేటర్లో ఆడుతునే ఉంది. కానీ చడీ చప్పుడు లేకుండా.. మూడు వారాల్లోనే ఓటిటిలో రిలీజ్ చేసి షాక్ ఇచ్చారు. ప్రముఖ ఓటిటి సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్కు వచ్చేసింది బలగం. మొత్తం మూడు భాషల్లో రీలీజ్ చేశారు. తెలుగుతో పాటు తమిళ్, మలయాళ భాషల్లో అందుబాటులోకి తీసుకొచ్చారు. దీంతో థియేటర్లో నడుస్తుండగానే.. ఓటిటిలో రిలీజ్ ఏంటని కాస్త షాక్ అవుతున్నారు నెటిజన్స్. చిన్న సినిమా కావడంతోనే ఇలా చేశారని.. అదే స్టార్ హీరోల హిట్ సినిమాలకు ఇలా చేస్తారా.. అంటూ కామెంట్స్ చేస్తున్నారు. అయితే నెటిజన్స్ మాత్రమే కాదు.. ఈ సినిమాలో హీరోగా నటించిన ప్రియదర్శికి కూడా.. బలగం సినిమా ఓటిటిలోకి వస్తున్న విషయం తెలియదేమో. ముందు రోజు ఈ సినిమా ఓటీటీ రిలీజ్ పై వచ్చిన వార్తలపై స్పందిస్తూ.. ఇప్పట్లో బలగం ఓటీటీలోకి రావడం కష్టమే.. థియేటర్లలోనే చూడండి అంటూ ట్వీట్ చేశాడు. అయితే ఆ తర్వాత ఆ ట్వీట్‌ను డిలీట్ చేశాడు. ఈలోపే ఓటిటిలోకి వచ్చేసింది బలగం. దీంతో ఓటిటి ఫ్యాన్స్ ఖుషీ అవుతుండగా.. థియేటర్ ఫ్యాన్స్ కాస్త డిసప్పాయింట్ అవుతున్నారు.