ప్రముఖ కమెడీయన్ వేణు దర్శకత్వం వహించిన బలంగం మూవీ రివ్యూ వచ్చేసింది. రెండు రోజుల ముందుగానే ఈ చిత్రం ప్రీమియర్ షోలు వేయడంతో స్టోరీ బయటకు వచ్చింది. ఈ క్రమంలో ఈ సినిమా స్టోరీ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. అసలు ఈ చిత్రం మార్చి 3న థియేటర్లలో విడుదల కానుంది.
నటీనటులు: ప్రియదర్శి, కావ్య కళ్యాణ్‌రామ్, వేణు, రచ్చ రవి ప్రధాన పాత్రల్లో యాక్టింగ్
సినిమాటోగ్రఫీ: ఆచార్య వేణు
సంగీతం: భీమ్స్ సిసిరోలియో
నిర్మాతలు: హర్షిత్ రెడ్డి, హన్షిత రెడ్డి
ప్రొడక్షన్: దిల్ రాజు ప్రొడక్షన్స్
విడుదల తేదీ: మార్చి 3, 2023
సినిమాల్లో చిన్న చిన్న క్యారెక్టర్స్ చేస్తున్న సమయంలోనే జబర్డస్త్ కామెడీ షో ద్వారా తెలుగు రాష్ట్ర ప్రజలకి దగ్గరయ్యాడు టిల్లు. తాజాగా బలగం సినిమాతో డైరెక్టర్ గా మారారు.. ఈ సినిమాని దిల్’ రాజు వారసులు హర్షిత్ రెడ్డి, హన్షిత నిర్మించారు. ప్రియదర్శి, కావ్యా కళ్యాణ్ రామ్ జంటగా నటించారు. సినిమాపై నమ్మకంతో రెండు రోజుల ముందుగా ప్రీమియర్ షోలు వేశారు. మరి, ‘బలగం’ ఎలా ఉంది? ప్రియదర్శి హిట్ కొట్టాడా ? రివ్యూ లో తెలుసుకుందాం.
కథ
తెలంగాణ లోని గ్రామీణ కుటుంబంలో జరిగే కథ.. ఇంకా చెప్పాలంటే ఓ కాకి కథ. కొమురయ్య ఊళ్లో తలలో నాలుకలా ఉంటాడు. అందరితో కలిసి మెలిసి ఉంటాడు. రోడ్డున వెళ్లే ప్రతీ ఒక్కరినీ పలకరిస్తుంటాడు. అతనికి ఐలయ్య, మొగిలయ్య అనే ఇద్దరు కొడుకులుంటారు. లక్ష్మీ అనే కూతురు కూడా ఉంటుంది. కానీ కూతురు, అల్లుడితో మాటలు ఉండవు. కొమురయ్య మనవడే సాయిలు అంటే మన హీరో ప్రియదర్శి. వ్యాపారం అంటూ అప్పులు చేస్తూ నష్టపోతుంటాడు. అలాంటి సాయిలు పెళ్లి చేసుకుని వచ్చిన కట్నంతో అప్పులు తీర్చాలని అనుకుంటాడు. కానీ అదే సమయంలో అనుకోకుండా కొమురయ్య మరణిస్తాడు. మరి సాయిలు తన అప్పు తీర్చాడా? దూరంగా ఉండే అత్త కుటుంబాన్ని, తన తండ్రికి ఎలా దగ్గర చేశాడు? అసలు రెండు కుటుంబాలకు మధ్య దూరం ఎందుకు పెరిగింది? చివరకు బలగం అంతా ఎలా ఒక్కటి అయింది? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
విశ్లేషణ
చావు చుట్టూ జరిగే సంఘటనలను డైరెక్టర్ వేణు సినిమాలాగా తెరకెక్కించాడు. అందులో కూడా అన్ని రకాల ఎమోషన్స్‌ను చూపించడం మామూలు విషయం కాదనే చెప్పాలి. ఈ క్రమంలో చెప్పాలనుకున్న విషయంతోపాటు ఇవ్వాలనుకున్న మెసేజ్ ను కూడా చావు చుట్టూ తిప్పి చూపించడంలో వేణు డైరెక్టర్ గా విజయం సాధించాడని చెప్పవచ్చు. దర్శకుడిగా మాత్రమే కాకుండా తన మాటలతో కూడా మెప్పించాడు. అయితే వేణు ఈ సినిమాను పూర్తి తెలంగాణ సంస్ర్కృతి అద్దం పట్టే విధంగా చిత్రీకరించాడు. తెలంగాణ యాస, ప్రాస, జీవన శైలిని తెరపై చక్కగా చూపించాడు.
ఏలా ఉందంటే
సినిమాలోని పాత్రలో ప్రేక్షకుడు ప్రయాణించేలా చేయడంలో వేణు సక్సెస్ అయినట్టుగా అనిపిస్తుంది. స్టోరీ అలా స్మూత్ గా సాగిపోతూ ఉంటుంది. కొందరికి ఈ సినిమా బోరింగ్‌గా కూడా అనిపించొచ్చు. కానీ తెలంగాణ నేటివిటీతో ఇట్టే కనెక్ట్ అవుతుంటారు. మన లైఫ్ లోనే అలా జరుగుతున్నట్టు కొన్ని సీన్లు కనిపిస్తాయి. అయితే ప్రథమార్థం అంతా కూడా సాఫీగా సాగుతుంది. అక్కడక్కడా నవ్వులు పూయిస్తూ ఉంటారు. సెకండాఫ్‌కు వచ్చే సరికి కథ కాస్త సీరియస్ అవుతుంది. పంతాలు, పట్టింపులు, రాగ ద్వేషాలు, ప్రేమలు అనే ఎమోషన్స్ మాత్రం సినిమా ఆసాంతం చూపిస్తూనే ఉంటాడు వేణు. క్లైమాక్స్‌కు వచ్చే సరికి మాత్రం అందరినీ ఏడిపించేస్తాడు. బలగం అంటే కుటుంబం అంతా కలిసి ఉండటం. అదే మన తల్లిదండ్రులకు ఇచ్చే ప్రేమ, గౌరవం. బలగం ఉంటేనే బలం.. అని చెప్పాలనుకున్న సందేశం మాత్రం జనాలకు రీచ్ అవుతుంది. బలగం సినిమాకు సంగీతం, పాటలు, ఆర్ఆర్ బలం. సినిమాటోగ్రఫీ చక్కగా ఉంది. ఊరి వాతావరణాన్ని కళ్లకు కట్టినట్టు చూపించారు. ఎడిటింగ్, ఆర్ట్ డిపార్ట్మెంట్ ఇలా అన్ని విభాగాలు చక్కగా కుదిరాయి. నిర్మాణ పరంగా ఈ సినిమా ఎంతో ఉన్నతంగా అనిపిస్తుంది.
మొత్తానికి అసలు సిసలైన తెలంగాణ పల్లె జీవితాన్ని ఆవిష్కరించిన మూవీ. కాకి చుట్టు అల్లుకున్న మానవ సంబంధాలను, కుటుంబ అనుబంధాల గొప్పతనాన్ని ఆవిష్కరించిన సినిమా.
ప్లస్ పాయింట్స్
సంగీతం
భావోద్వేగాలు
స్టోరీ
నిర్మాణ విలువలు
నెగిటివ్ పాయింట్స్
సెకండాఫ్ లో కొన్ని సీన్లు లాగ్
కొన్ని సీన్లు పాతవి అనిపిస్తాయి