»Gift Of Daughter Video Song Manchu Vishnu The Tearful Hero Marriage Anniversary
Manchu Vishnu: కుమార్తెల గిఫ్ట్.. కన్నీళ్లు పెట్టుకున్న మంచు విష్ణు
తన కుమార్తెలు పాడిన పాట ముగిసే సమయానికి తనకు ఏడుపు వచ్చిందని హీరో మంచు విష్ణు తెలిపారు. మంచు విష్ణు, విరానికా రెడ్డి పెళ్లి వార్షికోత్సవం సందర్భంగా తన కుమార్తెలు ఇచ్చిన వీడియో గిఫ్టును చూసి ఆశ్చర్యానికి లోనైనట్లు ట్విట్టర్ వేదికగా వెల్లడించాడు. ఈ బహుమతిని ఎప్పటికీ మర్చిపోలేను భావోద్వేగానికి లోనవుతూ చెప్పాడు.
టాలీవుడ్ హీరో మంచు విష్ణు(manchu vishnu) పెళ్లి రోజు(marriage anniversary) సందర్భంగా తన కుమార్తెలు ఇచ్చిన గిఫ్ట్ చూసి కన్నీరు(tears) పెట్టుకున్నానని పేర్కొన్నాడు. తన కూతుర్లు ఆశ్చర్యకరమైన బహుమతిని(gift) అందజేశారని ట్విట్టర్ వేదికగా తెలిపాడు. ఆ బహుమతిలో భాగంగా మంచు విష్ణు, తన భార్య(viranica reddy)తో ఉన్న పలు సంఘటలను వీడియోలో సాంగ్ రూపొందించి ఇచ్చినట్లు చెబుతూ ఆ వీడియోను షేర్ చేశాడు. వీడియోలో మంచు విష్ణు కుమార్తె ఇంగ్లీష్ లో వారి తల్లిదండ్రుల గురించి పాటడం చూడవచ్చు. ఫాదర్ అండ్ మదర్ లవ్ యూ అంటూ రూపొందించిన వీడియో ఆకట్టుకుంటుంది. అంతేకాదు అరియానా(Ariaana), వివియానా(Viviana) ఇప్పటికే 2022లో విష్ణు యాక్ట్ చేసిన జిన్నా మూవీ(ginna movie)లో కూడా ఓ సాంగ్ ఆలపించారు.
I started crying towards the end of the song. Thank you my darling #Ariaana#Viviana, my little mommies ❤️❤️❤️❤️❤️. This has made my day and I will never forget this surprise gift for @vinimanchu and me. pic.twitter.com/RZI13tazny
ఈ వీడియో చూసిన పలువురు సో క్యూట్ అంటూ కామెంట్లు(comments( చేస్తున్నారు. మరికొంత మంది వండర్ ఫుల్ సాంగ్, టాలెంటెడ్ గర్ల్స్ అంటూ వ్యాఖ్యలు చేశారు. సూపర్ వాయిస్, వండర్ ఫుల్ అంటూ పలు రకాలుగా కామెంట్లు చేస్తున్నారు. ఈ క్రేజీ వీడియో(video)ను మీరు కూడా చూసేయండి మరి.
ఇక మంచు విష్ణు, విరానికా రెడ్డి(viranica reddy)కి మార్చి 1, 2009న వివాహం జరిగింది. 2023 నాటికి వీరికి పెళ్లి జరిగి 15 ఏళ్లు అయిన సందర్భంగా సెలబ్రేషన్స్ చేసుకున్నారు. అంతేకాదు 2009లో అప్పటి ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డికి విరానికా రెడ్డి మేనకోడలు కావడం విశేషం. ఈ జంటకు 2011లో వీరికి కవల కుమార్తెలు(twin babies) జన్మించారు. జనవరి 2018లోఓ కుమారుడు ఉండగా, ఆగస్టు 2019లో వీరికి ఒక కుమార్తె జన్మించింది. ఈ దంపతులకు కవల పిల్లలు అరియానా, వివియానా పుట్టినప్పుడు తనకు బెస్ట్ మూమెంట్ అని విష్ణు ఓ సందర్భంలో చెప్పాడు.