Balagam : కమెడియన్ టిల్లు వేణులో మంచి దర్శకత్వ ప్రతిభ ఉంది. అది గుర్తించే.. ముందుగా నిర్మాత దిల్ రాజు, వేణుకి డైరెక్టర్‌గా ఛాన్స్ ఇచ్చాడు. ఆ నమ్మకాన్ని వమ్ము చేయలేదు వేణు. తెరపై కమెడియన్‌గా కనిపించే వేణు.. రచనలో ఇంత సీరియస్ అని.. 'బలగం' మూవీ చూస్తే గానీ అర్థం కాదు.
కమెడియన్ టిల్లు వేణులో మంచి దర్శకత్వ ప్రతిభ ఉంది. అది గుర్తించే.. ముందుగా నిర్మాత దిల్ రాజు, వేణుకి డైరెక్టర్‌గా ఛాన్స్ ఇచ్చాడు. ఆ నమ్మకాన్ని వమ్ము చేయలేదు వేణు. తెరపై కమెడియన్‌గా కనిపించే వేణు.. రచనలో ఇంత సీరియస్ అని.. ‘బలగం’ మూవీ చూస్తే గానీ అర్థం కాదు. పక్కా తెలంగాణ బ్యాక్ డ్రాప్లో తెరకెక్కిన బలగం.. చిన్న సినిమాగా వచ్చి, పెద్ద ప్రభావం చూపించేలానే ఉంది. రిలీజ్‌కు ముందే.. తనదైన ప్రమోషన్స్‌తో మంచి బజ్ క్రియేట్ చేశారు దిల్ రాజు. సిరిసిల్లలో ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిపి.. ఆ వేడుకకు మంత్రి కేటీఆర్‌ని ముఖ్య అతిథిగా తీసుకొచ్చి.. సినిమా పై హైప్ క్రియేట్ చేశారు. దాంతో స్పెషల్ ప్రీమియర్స్‌తో పాజిటివ్ రివ్యూలు.. రిలీజ్ అయినా తర్వాత పాజిటివ్ టాక్ సొంతం తెచ్చుకుంది బలగం. దిల్ రాజు ప్రొడక్షన్స్ పేరుతో బ్యానర్ ఏర్పాటు చేసి.. ఆయన కుమార్తె హన్షిత రెడ్డి ఈ సినిమాను నిర్మించగా.. ప్రియదర్శి, కావ్య కళ్యాణ్ రామ్ లీడ్ రోల్ పోషించారు. ఈ సినిమాకు భీమ్స్ అందించిన మ్యూజిక్, బీజిఎం హైలెట్‌గా నిలిచింది. అయితే తక్కువ మందికే ‘బలగం’ రీచ్ అయ్యేలా ఉన్నా.. సినిమా చూసిన ప్రతి ఒక్కరూ కనెక్ట్ అయిపోతున్నారు. దాంతో ఈ సినిమా వీకెండ్ వరకు మరింత బలపడే అవకాశం ఉందంటున్నారు. ఇదిలా ఉంటే.. బలగం సినిమా ఓ వివాదంలో చిక్కినట్టే అనిపిస్తోంది. ఓ జర్నలిస్ట్ బలగం సినిమా కథ నాదేనని అంటున్నారు. 2011లో తాను రాసిన పచ్చికీ కథను బలగం పేరుతో కాస్త చిన్న మార్పులు చేసి తెరకెక్కించారని అంటున్నారు. 90 శాతం కథ తనదేనని.. మిగిలిన 10 శాతమే మార్చారని అంటున్నారు. అందుకే రైటర్‌గా కథకు సంబంధించిన క్రెడిట్ తనకే ఇవ్వాలని.. లేదంటే చట్టపరంగా ముందుకు వెళతానని అంటున్నారట. మరి ఈ వివాదం ఎక్కడి వరకు వెళ్తుందో చూడాలి.