»Srimanthudu Story Controversy Koratala Shivas Setback In The Supreme Court
Supreme Court: శ్రీమంతుడు కథ వివాదం.. కొరటాల శివకు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ
తెలుగు దర్శకుడు కొరటాల శివకు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. శ్రీమంతుడు చిత్ర కథను కాపీ కొట్టాడు అంటూ ఓ రచయిత కోర్టును ఆశ్రయించాడు. తెలంగాణ న్యాయస్థానం రచయితకు అనుకూలంగా తీర్పు ఇచ్చింది. దర్శకుడు సుప్రీంకోర్టు తలుపు తట్టాడు. విచారించిన ధర్మాసనం కింది కోర్టు ఇచ్చిన తీర్పును కట్టుబడి ఉండమని ఉత్తర్వులు జారీ చేసింది.
Srimanthudu story controversy.. Koratala Shiva's setback in the Supreme Court
Supreme Court: సామాజిక చైతన్యాన్ని కల్పించే చిత్రాలను తెరకెక్కించే దర్శకుడిగా పేరు తెచ్చుకున్న డైరెక్టర్ కొరటాల శివ(Koratala Shiva). తాజాగా ఆయనకు సుప్రీంకోర్టు(Supreme Court)లో ఎదురుదెబ్బ తగిలింది. కింది కోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం క్రిమనెల్ కేసును ఎదుర్కోవాలని ఆదేశించింది. మహేష్ బాబు(Mahesh Babu) హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం శ్రీమంతుడు. ఒక ఊరును దత్తత తీసుకోవాలనే అద్భుతమైన కాన్సెప్ట్‌తో వచ్చిన ఈ చిత్రం పెద్ద విజయం సాధించింది. దీంతో డైరెక్టర్‌కు ప్రత్యేకమైన అభిమానులు ఏర్పడ్డారు. అంతటి విజయం సాధించడానికి ముఖ్య కారణం కథ. అయితే ఆ కథ తనదే అంటే శరత్ చంద్ర అనే కోర్టును ఆశ్రయించాడు. స్వాతి మాస పత్రికలో వచ్చిన తన కథను కాపీ చేసి శ్రీమంతుడు చిత్రాన్ని తెరకెక్కించారంటూ రచయిత శరత్ చంద్ర నాంపల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన నాంపల్లి కోర్డు కొరటాల శివపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని ఆదేశించింది.
నాంపల్లి కోర్టు ఉత్తర్వులను సవాల్ చేస్తూ కథను తాను కాపీ కొట్టలేదంటూ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించాడు కొరటాల శివ. హైకోర్టులో విచారణ చేపట్టారు. కథను కాపీ కొట్టారు అని పలు ఆధారాలను హైకోర్టుకు రైటర్ శరత్ చంద్ర అందజేశారు. రచయితల సంఘం శ్రీమంతుడు కథ, శరత్ చంద్ర రాసిన నవల ఒకే స్టోరీ అని హైకోర్టుకు నివేదికను ఇచ్చింది. వీటిని పరిగణనలోకి తీసుకున్న హైకోర్టు నాంపల్లి కోర్టు ఉత్తర్వులను సమర్థించింది. ఇక్కడితో ఆగని కొరటాల శివ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దర్శకుడి పిటిషన్‌పై విచారణ జరిపిన జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, జస్టిస్ హృషికేశ్ రాయ్ ల ధర్మాసనం పిటిషన్ ను కొట్టివేసింది. నాంపల్లి కోర్టు ఇచ్చిన క్రిమినెల్ కేసును ఎదుర్కోవలన్నా తీర్పును సమర్థించింది. శ్రీమంతుడు కథ విషయానికి వస్తే.. చాలా డబ్బులున్న రవికాంత్ కొడుకు హార్షవర్దన్ అనుకోని పరిస్థితుల్లో సొంత గ్రామానికి వెళ్లి అభివృద్ధి పనులు చేస్తాడు. అక్కడ కొందరు రాజకీయ నాయకులు ఆయన చేస్తున్న పనులకు అడ్డుపడుతారు. వాల్లను ఎలా ఎదిరించాడు. ఆ గ్రామానికి ఎలాంటి పనులు చేశాడు. వాళ్ల నాన్నకు ఆ ఊరికి గతంలో ఏం జరిగింది అనేది శ్రీమంతుడు సినిమా కథ.