»In Gujarats Vadodara The Women Who Stole And Then Sat On The Road Half Naked
Strip On Road: కేడీ మహిళలు.. దొంగతనం చేసి నగ్నంగా రోడ్డుపై బైఠాయించారు.
దొంగతనం చేసిన మహిళలను షాప్ యజమానితో సహా కొంతమంది వెంబడించారు. వారినుంచి తప్పించుకోవడానికి అర్థనగ్నంగా రోడ్డుపై కూర్చున్నారు. పైగా యజమానులే వారిని అలా అవమానించారని ఆరోపించారు.
In Gujarat's Vadodara, the women who stole and then sat on the road half-naked
Strip On Road: దొంగతనం(theft) చేసిన మహిళలు పట్టుబడకుండా నడిరోడ్డుపై దుస్తులు విప్పి కూర్చున్నారు. యజమానుల ఫిర్యాదుతో పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన గుజరాత్(Gujarat)లోని వడోదర(Vadodara)లో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన సమాచారం ప్రకారం కరేలీబాగ్ సమీపంలోని అంబాలాల్ పార్క్‌లో ఇక్బాల్ అనే వ్యక్తి లాండ్రీ షాప్ నిర్వహిస్తున్నాడు. నిన్న మధ్యాహ్నం సమయంలో నలుగురు మహిళలు షాపులోకి వచ్చారు. ఇక్బాల్‌ను మాటల్లో పెట్టి రూ. 25 వేలు చోరీ చేశారు. అనంతరం ఆ షాపు నుంచి వెళ్లిపోయారు. చోరీని గుర్తించిన ఇక్బాల్ మరికొందరితో కలిసి మహిళలను వెంబడించారు. విషయం తెలుసుకున్న కేడీలు పారిపోయారు.
తమను తరుముతు యజమాని వెళ్లాడు. వీరికి దొరకకుండా మహిళ నడిరోడ్డుపై దుస్తులు విప్పి కూర్చున్నారు. యజమానులు దగ్గరకు వచ్చి తమతో మాట్లాడుతే, వారికి ఏ సంబంధం లేదంటూ రివర్స్ అయ్యారు. దీంతో పోలీసులకు సమాచారం అందించగా, అర్ధ నగ్నంగా రోడ్డుపై కూర్చున్న మహిళలను పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లారు. వారిని విచారించగా తమను వెంబడించిన వారే దాడిచేసి దుస్తులు విప్పారని ఆరోపించారు.
పట్టుబడకుండా మహిళలు తామే దుస్తులు విప్పి కూర్చున్నారా? లేదంటే, నిజంగా వారిని వెంబడించిన వారే దుస్తులు విప్పించారా? అనే నిర్ధారణ కోసం పోలీసులు సీసీటీవీ ఫుటేజీలను తనిఖీ చేస్తున్నారు. నిందితులైన మహిళల నుంచి రూ.9 వేలు స్వాధీనం చేసుకున్నారు. మిగితా డబ్బు తప్పించుకునే క్రమంలో రోడ్డుపై ఉద్దేశపూర్వంగా పడేసినట్లు ఇక్బాల్ ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.