Venu : బలగం సినిమా చూసిన తర్వాత.. ఇలాంటి మంచి సినిమా అందించినందుకు నిర్మాత దిల్ రాజు, దర్శకుడు వేణు పై ప్రశంసలు వెల్లువెత్తాయి. ప్రతి ఒక్కరు ఎమోషనల్‌గా కనెక్ట్ అయిపోయారు. సినిమా రిలీజ్ అయి వారం రోజులు అవుతున్నా.. రోజు రోజుకి బాక్సాఫీస్ దగ్గర మరింతగా బలపడుతునే ఉంది బలగం.
బలగం సినిమా చూసిన తర్వాత.. ఇలాంటి మంచి సినిమా అందించినందుకు నిర్మాత దిల్ రాజు, దర్శకుడు వేణు పై ప్రశంసలు వెల్లువెత్తాయి. ప్రతి ఒక్కరు ఎమోషనల్‌గా కనెక్ట్ అయిపోయారు. సినిమా రిలీజ్ అయి వారం రోజులు అవుతున్నా.. రోజు రోజుకి బాక్సాఫీస్ దగ్గర మరింతగా బలపడుతునే ఉంది బలగం. ఓవరాల్‌గా కోటిన్నర ప్రీ రిలీజ్ బిజినెస్ టార్గెట్‌తో రిలీజైన బలగం సినిమా.. ఫస్ట్ వీక్‌లో ఏకంగా ఏడు కోట్ల గ్రాస్‌ను, మూడు కోట్లకుపైగా షేర్‌ను రాబట్టినట్లు సమాచారం. ఒక్క నైజాం ఏరియాలోనే ఈ సినిమాకు నాలుగున్నర కోట్ల కలెక్షన్స్ వచ్చినట్లు చెబుతున్నారు. దాంతో ఫస్ట్ వీక్‌లోనే రెండింతల లాభాలను తెచ్చి పెట్టింది బలగం. పైగా ఈ వారం చెప్పుకోదగ్గ సినిమాలు రిలీజ్ కాకపోవడంతో.. బలగం మరిన్ని లాభాలు తెచ్చిపెట్టడం ఖాయమంటున్నారు. మొత్తంగా బలగం పది కోట్ల మార్క్‌ని టచ్ చేయడం ఈజీ అంటున్నారు. దిల్‌రాజు సమర్పణలో హన్షిత, హర్షిత్‌రెడ్డి ఈ సినిమాను నిర్మించారు. ప్రియదర్శిని, కావ్య కళ్యాణ్ రామ్ లీడ్ రోల్ పోషించారు. ఇక డైరెక్టర్‌గా వేణు యెల్దెండి.. ఈ సినిమాతో సాలిడ్ ఎంట్రీ అందుకున్నట్టే. అతను ఊహించిన దానికంటే పెద్ద గుర్తింపే తీసుకొచ్చింది బలగం. దాంతో నెక్స్ట్ ప్రాజెక్ట్ కూడా దిల్ రాజు బ్యానర్లో చేయబోతున్నాడు. అయితే ఈసారి బిగ్ స్కేల్ మూవీ ప్లానింగ్‌లో ఉన్నాడు. అంతేకాదు గీతా ఆర్ట్స్ కూడా వేణుతో సినిమా చేసే అవకాశం ఉందని వినిపిస్తోంది. అయితే ప్రస్తుతానికైతే దిల్ రాజు బ్యానర్లోనే సినిమా చేయబోతున్నట్టు క్లారిటీ ఇచ్చాడు వేణు. ఇప్పటికే దిల్ రాజుకు లైన్ చెప్పగా.. ఓకే చెప్పారని అన్నారు. మొత్తంగా బలగం.. చిన్న సినిమాగా వచ్చి పెద్ద ప్రభావాన్ని చూపించింది.