»A Balagam Film That Has Achieved A Rare Feat 100 International Awards
Balagam: అరుదైన ఘనత సాధించిన బలగం చిత్రం
గతంలో అనేక హిట్ సినిమాల్లో హాస్యనటుడిగా పేరు తెచ్చుకున్న వేణు యెల్దండి(venu yeldandi) మొదటి సారి దర్శకత్వం వహించిన ఎమోషనల్ విలేజ్ డ్రామా బలగం(balagam)తో ఈ సంవత్సరం టాలీవుడ్ బ్లాక్ బస్టర్ సక్సెస్ సాధించాడు. ఈ చిత్రం తాజాగా మరో అరుదైన ఘనతను సాధించింది.
ఈ మధ్యకాలంలో చిన్న సినిమాగా వచ్చి, సంచలనం సృష్టించింది బలగం(balagam). డైరెక్టర్ గా కనీసం అవగాహన కూడా లేని వేణు(venu yeldandi) ఈ సినిమాని అద్భుతంగా చిత్రీకరించాడు. ప్రియదర్శి, కావ్య కళ్యాణ్‌రామ్, సుధాకర్ రెడ్డి, జయరామ్, స్వరూప, విజయలక్ష్మి, మురళీధర్, రచ్చరవిలు ఈ సినిమాలో ప్రధాన పాత్రలు పోషించారు. వేణు యెల్దండి దర్శకత్వంలో తెరకెక్కిన బలం చిత్రం విడుదలైనప్పటి నుంచి అందరినీ ఆకట్టుకుంటోంది. ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలు పొందడమే కాకుండా అనేక అంతర్జాతీయ అవార్డులు, రివార్డులను కూడా గెలుచుకుంది. మరీ ముఖ్యంగా ఈ చిత్రం సినీ ప్రేమికులందరి హృదయాలను గెలుచుకుంది.
తాజాగా బలగం మూవీ మరో అరుదైన గౌరవాన్ని సాధించింది. ఇది 100 అంతర్జాతీయ అవార్డుల(100 international awards)ను గెలుచుకుంది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని, మేకర్స్ ఓ పోస్టు విడుదల చేశారు. “ఎ జర్నీ ఆఫ్ ఎక్సలెన్స్ అండ్ రికగ్నిషన్..ఇంతకు ముందు మన సినిమా 100 రోజులు నడిచేది. 100 సెంటర్లలో సినిమాలు.. 100 కోట్లు కలెక్ట్ చేసిన సినిమాలు. ఇప్పుడు 100+ ఇంటర్నేషనల్ అవార్డ్లు సాధించింది. బలగం సినిమా స్పెషల్ ఫిల్మ్’’ అంటూ పోస్టు విడుదల చేశారు. దర్శకుడు వేణు యెల్దండి తొలిసారిగా తెలంగాణ ప్రజల భావోద్వేగాలు, భావాలను హైలైట్ చేసిన విధానం, తెలంగాణ గ్రామీణ వాతావరణాన్ని తెరపై ప్రదర్శించించిన విధానం అందరినీ ఆకర్షించింది. తెలంగాణలో పోటీ పరీక్షల్లో సినిమాకు సంబంధించి అనేక ప్రశ్నలు రావడం నిజంగా గొప్ప గౌరవం. ఫలితంగా ఏ సినిమాకు దక్కని విధంగా 100 అంతర్జాతీయ అవార్డులు రావడం విశేషం.