»Salaar Movie Story Line Leaked Social Media Fans Hull Chal Chal
Salaar: స్టోరీ లైన్ లీక్..నెట్టింట ఫ్యాన్స్ హల్ చల్
స్టార్ హీరో ప్రభాస్ నటించి సలార్(Salaar) మూవీ టీజర్ రేపు మార్నింగ్ విడుదల కానుంది. ఈ క్రమంలో ఈ మూవీ స్టోరీ లైన్(story line) గురించి నెట్టింట్ వైరల్ అవుతుంది. దీంతోపాటు అభిమానులు కూడా పలు రకాల స్టోరీ అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు.
పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ యాక్ట్ చేసిన సలార్(Salaar)మూవీ టీజర్ రేపు ఉదయం 5:12 గంటలకు రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఫ్యాన్స్ ఉత్కంఠగా టీజర్ కోసం వెయిట్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ మూవీ స్టోరీ లైన్ ఇదే అంటూ ఐఎండీబీ వెబ్ సైట్ ప్రకటించింది. ఇది చూసిన అభిమానులు మరింత ఆసక్తితో ఎదురుచూస్తున్నారు. ఒక ముఠా నాయకుడు తన మరణిస్తున్న స్నేహితుడికి చేసిన వాగ్దానాన్ని నిలబెట్టుకోవడానికి ప్రయత్నిస్తాడని, ఆ క్రమంలో ఇతర క్రిమినల్ ముఠాలను పట్టుకుంటాడని ఐఎండీబీ పేర్కొంది. కానీ మరికొంత మంది మాత్రం స్టోరీ లైన్(story line) ఎందుకు లీక్ చేశారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
మరోవైపు ఇది పూర్తిగా రాకీ భాయ్ మరణానికి సంబంధించిన KGF కనెక్షన్ అని కొంతమంది అభిమానులు స్క్రీన్షాట్లను షేర్ చేస్తూ స్టోరీని ఇదేనని పంచుకుంటున్నారు. ఈ కథ మాఫియా ప్యాక్‌ల చుట్టూ తిరుగుతుందని ఊహాగానాలు ఉన్నాయి. ఓ సహచరుడికి తాను చేసిన నిబద్ధతను సంతృప్తి పరచడానికి ఇతర చట్టాన్ని ఉల్లంఘించే సమావేశాలకు వ్యతిరేకంగా ప్రతీకారం తీర్చుకునే దుండగుల సమూహంలో ప్రభాస్ పాత్ర ఉంటుందని తెలుస్తోంది. ఈ సినిమాలో చాలా వరకు యాక్షన్ ఉంటుందని పలువురు భావిస్తున్నారు.
ఇక ఈ చిత్రం సెప్టెంబర్ 28, 2023న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది. దీని OTT ప్లాట్‌ఫారమ్ స్ట్రీమింగ్ తేదీ అతి త్వరలో వెల్లడి కానుంది. సాలార్ చిత్రానికి బ్లాక్ బస్టర్ మూవీ KGF డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వం చేశారు. ఈ చిత్రంలో ప్రభాస్, శృతి హాసన్ ప్రధాన పాత్రల్లో నటించగా, ఈ చిత్రాన్ని హోంబలే ఫిల్మ్స్ బ్యానర్‌పై విజయ్ కిరగందూర్ నిర్మించారు. ఈ మూవీకి రవి బస్రూర్ సంగీతం అందించగా, భువన్ గౌడ సినిమాటోగ్రఫీ అందించారు. ఈ మూవీలో ప్రభాస్ తోపాటు పృథ్వీరాజ్ సుకుమారన్, ఈశ్వరీ రావు, మధు గురుస్వామి, శ్రీయా రెడ్డి తదితరులు కూడా ఉన్నారు.