»The Shooting Of Vijay Deverakondas Film Khushi Has Been Completed Controversy Over Samanthas Character
Khushi: విజయ్ ఖుషీ షూట్ పూర్తి..సమంత పాత్రపై మొదలైన లొల్లి!
హీరో విజయ్ దేవరకొండ హీరోయిన్ సమంత నటిస్తున్న తాజా చిత్రం ఖుషీ సినిమా షూటింగ్ పూర్తి అయింది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ ఓ స్పెషల్ వీడియోను విడుదల చేసింది.
The shooting of Vijay Deverakonda's film Khushi has been completed. Controversy over Samantha's charac
Khushi: తెలుగు ఇండస్ట్రీలో రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ(Vijay Deverakonda)కు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. అర్జున్ రెడ్డి(Arjun Reddy) సినిమాతో కల్ట్ ఫ్యాన్ బేస్ ను సంపాదించుకున్న విజయ్ ఆ తరువాత గీతా గోవిందం(Geetha Govindam) అంటూ ఓ డిసెంట్ సినిమా చేసి ఫ్యామిలీ ఆడియన్స్ కు దగ్గరయ్యారు. డైనమిక్ డైరెక్టర్ పూరి జగన్నాథ్(Puri Jagannath) దర్శకత్వంలో మొదటి పాన్ ఇండియా సినిమా లైగర్(Liger) చిత్రంతో డిజాస్టర్ ను చవి చూశాడు. ఈ సినిమా తరువాత మళ్లీ ఓ డిసెంట్ లవ్ స్టోరీతో ప్రేక్షకుల ముందు వస్తున్న తాజా చిత్రం ఖుషీ(Khushi). ప్రేమచిత్రాలకు పేరు మోసిన యంగ్ డైరెక్టర్ శివ నిర్వాణ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాలో విజయ్ కి జోడిగా బ్యూటీఫుల్ హీరోయిన్ సమంత(Samantha) నటిస్తోంది. కశ్మీర్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం నుంచి విడుదలైన మొదటి సాంగ్ నా రోజా నువ్వే(Naa Roja nuvve) పాట ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకోంది. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన ఓ కీలక అప్డేట్ ను ప్రేక్షకులతో పంచుకున్నారు మూవీ మేకర్స్. సినిమాలోని ఒక స్పెషల్ వీడియోను విడుదల చేసి సినిమా షూటింగ్ పూర్తి అయినట్లు ప్రకటించారు.
ఈ మేరకు షూటింగ్ స్పాట్ నుంచి విడుదల చేసిన స్పెషల్ వీడియోలో కుటుంబ సభ్యులంతా గుడిలో యాగం చేస్తున్నట్టు ఉంది. ఈ వీడియోలో సమంత రెడ్ కలర్ చీర కట్టుకోగా.. విజయ్ షర్ట్, పంచ కట్టుకున్నాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతుంది. ఈ మేరకు నెటిజనులు ఓ ప్రశ్నను సందిస్తున్నారు. సినిమా నుంచి విడుదల చేసిన ఫస్ట్ సింగిల్ నా రోజా నువ్వే (Naa Roja nuvve) పాటలో సమంతా ముస్లిం అమ్మాయిగా చూపించారు కదా మరీ ఇప్పుడు విడుదల చేసిన వీడియోలో గుడిలో హిందు సాంప్రదాయ వస్త్రాలు కట్టుకొని ఉంది. దీంతో ప్రేక్షకుల్లో క్యూరీయాసిటీతో పాటు కొంత అనుమానానికి కూడా తావిస్తోంది.
కశ్మీర్ ఆర్మీ బ్యాగ్ డ్రాఫ్ లో కథ సాగుతుంది అని తెలుసు. మరీ సమంతా క్యారెక్టర్ ఎలా ఉంటుంది. తాను ముస్లిం అమ్మాయా లేదా హిందువా అనే అంశం చర్చనీయాంశం అవుతోంది. దీని మూలంగా సినిమా ఎదైన కాంట్రవర్సీకి గురి అవుతుందా అనే అనుమానాలు కూడా కలుగక మానవు. మైత్రీ మూవీ బ్యానర్ పై నిర్మిస్తున్న ఖుషీ చిత్రంతో మళ్లీ కమ్ బ్యాక్ ఇవ్వాలని విజయ్ గట్టిగానే ఫిక్స్ అయ్యాడు. తాజాగా షూటింగ్ ముగించుకున్న ఈ చిత్రం సెప్టెంబర్ 1 కు థియేటర్లో విడుదలకు ముస్తాబు అవుతుంది. మరి ఈ సినిమా విజయ్ స్టార్ డమ్ ను నిలబెడుతుందో లేదో చూడాలి. ఈ సినిమా తరువాత డైరెక్టర్ పరుశురామ్(Parushuram), నిర్మాత దిల్ రాజు(DilRaju) కాంబినేషన్ లో ఓ చిత్రాన్ని ప్రకటించిన విషయం తెలిసిందే.