మరో రెండు రోజుల్లో కల్కి 2898 ఏడి థియేటర్లోకి రాబోతోంది. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న ఈ మూవీ పై భారీ అంచనాలున్నాయి. 27న థియేటర్లోకి రానున్న ఈ సినిమాకు.. ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్స్ స్టార్ట్ అయ్యాయి. దీంతో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది.
Kalki 2898AD: 'Kalki' Sensation in Hyderabad.. RRR, Salar Out!
Kalki 2898AD: కల్కికి మరో సినిమా పోటీ లేనే లేదు. దీంతో.. రెండు తెలుగు రాష్ట్రాల్లో కల్కిని భారీ ఎత్తున రిలీజ్ చేస్తున్నారు. హైదరాబాద్‌లో సింగిల్ థియేటర్ నుంచి మల్టీఫ్లెక్స్‌ల వరకు ప్రతిచోట కల్కి చిత్రాన్నే ప్రదర్శిస్తున్నారు. మొన్నటి వరకు థియేటర్లు క్లోజ్ అయ్యే పరిస్థితి ఏర్పడింది. కానీ ఇప్పుడు కల్కి రాకతో థియేటర్లన్నీ కళకళలాడబోతున్నాయి. సలార్ వంటి మాసివ్ హిట్ తర్వాత ప్రభాస్ నుంచి వస్తున్న సినిమా కావడంతో.. కల్కి పై అంచనాలు భారీగా ఉన్నాయి. ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్స్ స్టార్ట్ అవగా.. ఓ రేంజ్లో బుకింగ్స్ జరుగుతున్నాయి.
యూఎస్ మార్కెట్లో అయితే కల్కి దుమ్ములేపుతోంది. నార్త్ అమెరికాలో ఈ చిత్రం జస్ట్ ప్రీ సేల్స్‌తోనే 3 మిలియన్ డాలర్స్ గ్రాస్ మార్క్ దాటేసింది. ఇప్పటికే లక్ష 25 వేల టికెట్లు అమ్ముడుపోయినట్లు తెలిసింది. ఇక తెలుగు రాష్ట్రాల్లో టికెట్లు దొరకడం లేదని ప్రభాస్ ఫ్యాన్స్ వాపోతున్నారు. కల్కి బుకింగ్స్ మొదలైన కొన్ని నిముషాల్లోనే చాలా థియేటర్స్ హౌస్ ఫుల్ అయ్యాయి. ఒక్క గంటలోనే 60 వేల టికెట్లు బుక్ అయినట్లుగా చెబుతున్నారు.ఒక్క హైదరబాద్ జోన్ పరిధిలో మొదటి రోజు 6 కోట్లకు పైగా రాబట్టినట్లుగా సమాచారం.
అంతేకాదు.. హైదరాబాద్‌లో టాప్ 5 అడ్వాన్స్ డే వన్ గ్రాస్‌లో కల్కి టాప్‌లో నిలిచిందని అంటున్నారు. ఇప్పటివరకూ కేవలం బుకింగ్స్ పరంగా హైదరాబాద్‌లోనే 15 కోట్ల వరకు వసూలు చేసినట్టుగా లెక్క చెబుతున్నారు. దీంతో కల్కి తర్వాతి స్థానంలో 12.5 కోట్లతో సలార్, 10.5 కోట్లతో ఆర్ఆర్ఆర్, 9.5 కోట్లతో ఆదిపురుష్ ఉందని అంటున్నారు. ఇక.. ఇప్పటివరకు అడ్వాన్స్ బుకింగ్స్‌లో మొత్తంగా దాదాపు 5 లక్షలకు పైగా టికెట్లు అమ్మడుపోయాయని తెలిసింది. ఏదేమైనా.. కల్కి డే 1 భారీ వసూళ్లను రాబట్టే ఛాన్స్ ఉంది