Strange in Group-4 First Paper.. Quotations on Balagam Movie Characters
Group-4: గ్రూప్-4 (Group-4) పరీక్ష జరుగుతోంది. ఉదయం, మధ్యాహ్నం రెండు పేపర్లు ఉన్న సంగతి తెలిసిందే. సాయంత్రం 5 గంటలకు పరీక్ష ముగియనుంది. ఫస్ట్ పేపర్లో విచిత్రం చోటుచేసుకుంది. ఇటీవల రిలీజై మంచి ఆదరణ పొందిన బలగం (balagam) మూవీ గురించి ప్రశ్నలు వచ్చాయి. దీంతో అభ్యర్థులు ఆశ్చర్యపోయారు.
బలగం (balagam) సినిమా గురించి ప్రశ్న వస్తే ఫర్లేదు.. కానీ ఆ మూవీలో చేసిన పాత్రల గురించి కొశ్చన్స్ వేశారు. దాంతోపాటు ఆ మూవీ యూనిట్ సభ్యులపై కూడా అడిగారట. దీంతో సినిమాలు చూడని, నాలెడ్జ్ లేని అభ్యర్థులు ఇబ్బంది పడ్డారు. మూవీ గురించి ప్రశ్నలు వేస్తే ఫర్లేదు.. కానీ యూనిట్ సభ్యుల గురించి తమకేం ఐడియా ఉంటుందని అంటున్నారు.
బలగం (balagam) మూవీని కమెడీయన్ వేణు తెరకెక్కించారు. తక్కువ బడ్జెట్తో నిర్మించిన మూవీ మంచి వసూళ్లను రాబట్టింది. సినిమా (cinema) తీసిందుకు రూ.కోటి వ్యయం కాగా.. రూ.40 కోట్ల పైచిలుకు కలెక్షన్స్ రాబట్టింది. ఏ అంచనాలు లేకుండా వచ్చిన సినిమా.. మంచి హిట్ సాధించింది. ఇప్పుడు ఆ సినిమా గురించి గ్రూప్-4 (group-4) పరీక్షలో ప్రశ్నలు వచ్చాయి.