»Negligence Of Tspsc Mobile Caught Half An Hour After The Exam Started
TSPSC నిర్లక్ష్యం.. ఎగ్జామ్ స్టార్ట్ అయిన అరగంటకు పట్టుబడ్డ మొబైల్
టీఎస్ పీఎస్సీ తీరు మారడం లేదు. పేపర్ లీక్ అయిన తర్వాత కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవడం లేదు. ఈ రోజు జరిగిన గ్రూప్-4 ఫస్ట్ పేపర్ వద్ద లోపాలు కొట్టొచ్చినట్టు కనిపించాయి.
Negligence of TSPSC.. Mobile caught half an hour after the exam started
TSPSC: టీఎస్ పీఎస్సీ (TSPSC) తీరు మారడం లేదు. పేపర్ లీకేజీతో అభ్యర్థుల్లో ఆందోళన నెలకొన్న సంగతి తెలిసిందే. ఇటీవల జరిగిన గ్రూప్-1 పరీక్షకు హాజరుశాతం తగ్గింది. 39 శాతం మంది అభ్యర్థులు పరీక్ష రాసేందుకు ఇంట్రెస్ట్ చూపించలేదు. ఈ రోజు గ్రూప్-4 పరీక్ష జరుగుతోంది. ఉదయం, మధ్యాహ్నం రెండు పేపర్లు జరుగుతున్నాయి. సరూర్ నగర్లో ఓ కాలేజీ వద్ద సిబ్బంది నిర్లక్ష్యం కొట్టొచ్చినట్టు కనిపించింది.
ఓ అభ్యర్థి వద్ద మొబైల్ పట్టుబడింది. ఫస్ట్ పేపర్ ప్రారంభమైన అరగంటకు ఫోన్ను ఇన్విజిలెటర్ గుర్తించారు. ఫోన్ గుర్తించి.. పై అధికారులకు రిపోర్ట్ చేశారు. వెంటనే వారు పోలీసులను పిలిచి సదరు అభ్యర్థిని అప్పగించారు. సరూర్ నగర్ పోలీస్ స్టేషన్ తరలించడమే గాక.. మాల్ ప్రాక్టీస్ కేసు నమోదు చేశారు. మొబైల్ ఎందుకు తీసుకెళ్లావు.. తీసుకెళ్లొద్దు అని తెలియదా..? ఎగ్జామ్ రాసే సమయంలో మొబైల్ నుంచి సమాచారం తీసుకున్నావా..? అంటూ ప్రశ్నలు వేశారు. నిజానికి సెంటర్ వద్దకు వెళ్లే సమయంలో ముమ్మరంగా తనిఖీ చేస్తారు. మొబైల్, పర్స్, గాడ్జెట్ ఉంటే లాకర్ రూమ్ వద్ద పెట్టుకోవాలని చెబుతారు. రెండంచెల్లో తనిఖీ చేస్తుంటారు. సరూర్ నగర్ మారుతినగర్ వద్ద గల సక్సెస్ జూనియర్ కాలేజీ వద్ద మాత్రం నిర్లక్ష్యం కనిపించింది.
ఓ విద్యార్థిని హాల్ టికెట్ మిస్ అయ్యింది. సెంటర్ వద్దకు చేరుకున్న తర్వాత చూసేసరికి లేదు. ఆ విద్యార్థిని బోరుమని విలపించింది. ఈ ఘటన హన్మకొండ మిలీనియం స్కూల్ వద్ద జరిగింది. ఎంత ఏడ్చినప్పటికీ ఆమెను ఎగ్జామ్ సెంటర్ లోపలికి పంపించలేదు. హాల్ టికెట్ లేకపోవడం.. పరీక్షకు 10 నిమిషాలు ఆలస్యంగా రావడంతో రాయలేకపోయింది. ఆ వీడియోను ట్వీట్ చేయగా సోషల్ మీడియాలో ట్రోల్ అవుతుంది. కమిషన్ తీరుపై నెటిజన్లు దుమ్మెత్తి పోస్తున్నారు. ఈ రోజుల్లో కూడా హాల్ టికెట్ అంటూ ఆపడం సరికాదని కామెంట్స్ చేస్తున్నారు. మొబైల్లో హాల్ టికెట్ ఇమేజ్ ఉంటే చాలు అని.. అనుమతి ఇస్తే సరిపోయేదని సూచిస్తున్నారు.