Viral News: మత్స్యకారులకు చాలా అరుదుగా లభించే చేపలు వలలో చిక్కాయి. దీంతో మత్స్యకారుల మొహాల్లో సంతోషం నిండింది. ఎందుకంటే ఆ చేపల ఖరీదు అంత ఉంటుంది మరి. భారీ మొత్తాన్ని ఆర్జించిపెట్టిన ఈ చేపలు ఒక్కోటీ ఏకంగా రూ.2 లక్షల ధర పలికాయి. కృష్ణా జిల్లాకు చెందిన మత్స్యకారులకు అంతర్వేది సముద్ర తీరంలో 2 కచ్చిడీ చేపలు చిక్కాయి. ఈ చేపలను కోనసీమ జిల్లా అంతర్వేదిపల్లి పాలెం మినీ ఫిషింగ్ హార్బర్లో వేలం వేశారు. ఈ రెండు చేపలను ఓ వ్యాపారి రూ.4 లక్షలకు కొనుగోలు చేశాడు. ఈ చేపల్లో ఉండే తెల్లటి బ్లాడర్‌ను ఔషధాల తయారీలో, శస్త్రచికిత్సలో కుట్లు వేసే దారం తయారీలో వాడతారని మత్స్యకారులు చెప్పారు. అయితే మందుల తయారీకి ఉపయోగపడడం వల్లే వీటికి ధర ఇంత ఉంటుందని మత్స్యాకారులు చెబుతున్నారు.