ఉప్పెన సినిమాతో ఉప్పెనలా ఎగిసిడిన యంగ్ బ్యూటీ కృతి శెట్టి.. అదే స్పీడ్‌లో కిందకు పడిపోయింది. ఒక్క సినిమాతో హాట్ కేక్‌లా మారిపోయిన కృతిశెట్టి కెరీర్ ఇప్పుడు డైలామాలో పడిపోయింది. అసలు లైమ్‌లైట్‌లో లేకుండానే పోయింది కృతిపాప. ఇలాంటి సమయంలో కృతి(Krithi Shetty) చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
I like romantic characters Krithi Shetty shocking comments
ఉప్పెన, శ్యామ్ సింగరాయ్, బంగార్రాజు సినిమాలతో హ్యాట్రిక్ హిట్ కొట్టడంతో.. కృతి శెట్టి(Krithi Shetty) కెరీర్ పీక్స్‌కు వెళ్లిపోయింది. కానీ ఆ తర్వాత వచ్చిన సినిమాలు కృతిని కాపాడలేకపోయాయి. ది వారియర్, మాచర్ల నియోజక వర్గం, ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి, కస్టడీ సినిమాలు వరుసగా ఫ్లాప్ అయ్యాయి. దీంతో కృతి శెట్టికి ఇక ఆఫర్లు రావడం కష్టమే అనుకున్నారు. కానీ ఏకంగా కోలీవుడ్ స్టార్ ఇళయ దళపతి విజయ్‌తో ఛాన్స్ అందుకున్నట్టు తెలుస్తోంది. వెంకట్ ప్రభుతో విజయ్ చేయనునున్న కొత్త సినిమాలో ఛాన్స్ అందుకున్నట్టు సమాచారం. ప్రస్తుతానికైతే అరకొర సినిమాలే చేస్తోంది అమ్మడు. అయితే ఇప్పటి వరకు పెద్దగా స్కిన్ షో చేయని కృతి.. ఇప్పుడు గ్లామర్ డోస్ పెంచేసింది.
ఆఫర్లు తగ్గుతున్నాయిని భావిస్తుందో ఏమో గానీ..దేనికైనా సై అనేలా సిగ్నల్స్ ఇస్తోంది. తాజాగా కృతి చేసిన కామెంట్స్(comments) కూడా అలాగే ఉన్నాయి. రీసెంట్గా ఓ ఇంటర్వ్యూలో ఈ క్యూట్ బ్యూటీక బోల్డ్ సీన్ల గురించి అడగ్గా.. కాస్త షాకింగ్ ఆన్సర్ ఇచ్చింది. తనకు యాక్షన్ సన్నివేశాలు చేయడం కంటే..రొమాంటిక్ సీన్లలో నటించడమంటేనే ఎక్కువ ఇష్టమని చెప్పుకొచ్చింది. దీంతో మేకర్స్‌కు ఇండైరెక్ట్‌గా ఇక పై బోల్డ్ సీన్స్ కూడా చేస్తానని చెప్పేసింది కృతి. ఇక కృతి కామెంట్స్ పై నెటిజన్స్ రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. కొన్ని సినిమాల్లో ఓ రేంజ్ ముద్దులిచ్చావ్, రొమాన్స్ చేశావ్.. అందుకే ఆ సినిమాలు హిట్ అయ్యాయి. కానీ మిగతా చిత్రాల్లో రొమాంటిక్ సీన్లు చేయలేదు..దాంతో అవి అట్టర్ ఫ్లాప్ అయ్యాయి. ఇప్పటికైనా రియలైజ్ అయ్యావని.. కామెంట్స్ చేస్తున్నారు. మొత్తంగా కృతి శెట్టి మాత్రం రొమాన్స్(romance)కు సై అంటోందని చెప్పొచ్చు.