JGL: కథలాపూర్, మేడిపల్లి, మండలాల్లో మినీ స్టేడియంలు నిర్మించాలని కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్కు జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి ఎల్లేటి ముత్తయ్య రెడ్డి వినతిపత్రం సమర్పించారు. రెండు మండలాలలో మినీ స్టేడియాలను నిర్మిస్తే జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో క్రీడలు నిర్వహించడానికి అనుకూలంగా ఉంటుందన్నారు.