భూములు రీ సర్వే పక్కాగా జరగాలని రాష్ట్ర ల్యాండ్ రెవెన్యూ కమిషనర్ రోణంకి కూర్మనాథ్ అన్నారు. సంతబొమ్మాళి మండలం మేఘవరం పంచాయతీ పాతమేఘవరంలో జరుగుతున్న భూ రీ సర్వే పరిస్థితులను ఆయన శనివారం పరిశీలించారు. ఇక్కడ జరుగుతున్న సర్వేపై తహసీల్దార్ హేమసుందరరావును వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఇప్పటివరకు జరిగిన డేటాను సరి చూశారు.