AP: తిరుమల శ్రీవారి ఆర్జిత సేవలకు సంబంధించి ఏప్రిల్ నెల కోటా టికెట్లు 19న 10AMకు ఆన్లైన్లో విడుదల కానున్నాయి. లక్కీడిప్ కోసం 21న 10AM వరకు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. అలాగే 24న 10AMకు ప్రత్యేక ప్రవేశ దర్శనం రూ.300 కోటాను విడుదల చేస్తారు. భక్తులు టికెట్లను TTD సైట్లోనే బుక్ చేసుకోవాలని, ఇతరులను నమ్మి మోసపోవద్దని అధికారులు సూచించారు.