VSP: ఆనందపురం పరిధిలోని వెల్లంకి గ్రామంలో పేకాడుతున్న 16 మందిని సిటీ టాస్క్ ఫోర్స్ పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి పేక ముక్కలు, రూ.37,000 నగదును స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వారిని ఆనందపురం పోలీసులకు అప్పగించారు. అసాంఘిక కార్యకలాపాలపై వెంటనే ఫిర్యాదు చేయాలని పోలీసులు ప్రజలను కోరారు.