ADB: విద్యార్థులకు నచ్చిన రంగాన్ని తల్లిదండ్రులు ప్రోత్సహించాలని బోథ్ MLA అనిల్ జాదవ్ పేర్కొన్నారు. నెరడిగొండ మండలంలోని నారాయణపూర్ గ్రామానికి చెందిన చౌహన్ బాలాజీ కుమారుడు చౌహన్ వీరేందర్ జాతీయస్థాయి CISF ఉద్యోగం సాధించాడు. ఈ మేరకు వీరేందర్‌ను శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు తదితరులున్నారు.