»Producer Dil Raju Is Entering The Ott Digital Sector
Dil Raju: ఓటీటీ రంగంలోకి దిల్ రాజు
టాలీవుడ్ అగ్ర నిర్మాత దిల్ రాజు ఓటీటీ రంగంలోకి అడుగుపెట్టబోతున్నారు. దాని కోసం 25 చిన్న సినిమాలను కూడా నిర్మించబోతున్నట్లు తెలుస్తుంది. 2024లో డిజిటల్ ప్లాట్ ఫామ్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్లు సమాచారం.
Producer Dil Raju is entering the OTT digital sector
Dil Raju: లాక్ డౌన్ పుణ్యమా అని చాలా మందికి ఓటీటీ(OTT)లు అలవాటు అయ్యాయి. దీంతో థియేటర్లను డామినేట్ చేసే స్థాయిలో ఈ డిజిటల్ ప్లాట్ ఫామ్స్ తయారయ్యాయి. సినిమా బ్లాక్ బస్టర్ టాక్ వస్తే తప్ప థియేటర్లకు వెళ్లని పరిస్థితుల్లో కొన్ని సినిమాలు నేరుగా ఓటీటీలలో విడులై సూపర్ హిట్లు కొడుతున్నాయి. అందుకే టాలీవుడ్ ప్రముఖ అగ్రనిర్మాత దిల్ రాజు(Dil Raju) ఈ బిజినెస్‌పై కన్నెశాడు. భారీ సినిమాలు నిర్మించే రాజు డిజిటల్ రంగంలోకి వస్తున్నట్లు ఎప్పటినుంచో వార్తలు వినిపిస్తున్నా ఈ మేరకు కార్యచరణ మొదలుపెట్టినట్లు తెలుస్తుంది. ఇప్పటికే స్టార్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ ఆహా ఓటీటీ(Aha Ott)ని స్థాపించి సక్సెస్‌ఫుల్‌గా ముందుకు వెళ్తున్నారు. అలాగే అందులో టాక్ షోలను కూడా నిర్వహించి ప్రేక్షకులను అలరిస్తున్నారు. ఇప్పుడు ఇదే బాటలో దిల్ రాజు అడుగెయ్యడం అందరినీ ఆశ్చర్యపరుస్తుంది.
అయితే ఈ ఓటీటీని ఒక్కడే స్థాపిస్తాడా లేదా ఇతర ప్రముఖులతో కలిసి స్థాపిస్తారా అనేది తెలియాల్సి ఉంది. దీనికోసం రూ. 5 కోట్లు బడ్జెట్లో రూ.25 కోట్లు ఖర్చుతో మొత్తం ఐదు సినిమాలు నిర్మిస్తున్నట్లు తెలుస్తుంది. వీటిని డైరెక్ట్‌గా ఓటీటీలోనే విడుదల చేస్తారట. ఇప్పటికే ఈ ప్లాట్ ఫామ్‌కు సంబంధించిన పనులను మొదలు పెట్టినట్లు సమాచారం. వచ్చే ఏడాది ప్రేక్షకులకు అందుబాటులోకి రానుంది. ఇక మీదుట ఆయన నిర్మించే సినిమాలతో పాటు డిస్ట్రిబ్యూట్ చేసే చిత్రాలను అదే ఓటీటీలో విడుదల చేసే అవకాశం ఉంది. ప్రస్తుతం రామ్ చరణ్ హీరోగా తెరకెక్కుతున్న గేమ్ ఛేంజర్ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. పొలిటికల్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రం వచ్చే సంవత్సరం థియేటర్లో విడుదల కానుంది. శంకర్ దర్శకత్వంలో రూపొందుతుండడంతో ఈ చిత్రంపై ప్రేక్షకులకు విపరీతమైన అంచనాలు ఉన్నాయి.