GNTR: తుళ్లూరు మండలం వెంకటపాలెం వద్ద మంగళవారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. విజయవాడ వైపు నుంచి రాంగ్ రూట్లో వచ్చిన కారు ఎదురుగా వస్తున్న ట్రాక్టర్ డోజర్ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారు ముందు భాగం తీవ్రంగా దెబ్బతిన్నప్పటికీ, కారులో ఉన్న వారు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు.