న్యూ ఇయర్ ఈవెంట్‌కు రెడీ అయిన సన్నీలియోన్‌కు ఊహించని షాక్ తగిలింది. శ్రీకృష్ణుడి జన్మస్థలమైన మధురలో జనవరి 1న ఓ ప్రైవేట్ హోటల్లో ఆమెతో మెగా ఈవెంట్ నిర్వహించేందుకు ఏర్పాట్లు జరిగాయి. అయితే పవిత్ర గడ్డపై ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడంపై హిందూ సంఘాలు, సాదువులు అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో ఈవెంట్‌ను రద్దు చేస్తున్నట్లు యాజమాన్యం ప్రకటించింది.