ప్రియదర్శి, కావ్య కళ్యాణ్ రామ్ లీడ్ రోల్ పోషించగా.. దిల్ రాజు ప్రొడక్షన్స్ బ్యానర్‌పై హర్షిత్, హన్షిత నిర్మించారు. ఇక ఈ సినిమా పై విమర్శకులు సైతం ప్రశంసలు కురిపిస్తుండడంతొ.. మూడు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ టార్గెట్ రీచ్ అయినట్టు తెలుస్తోంది. ఫస్ట్ డే 55 లక్షలు, సెకండ్ డే 80 లక్షలు, మూడో రోజు కోటి 75 లక్షలు వసూలు చేసిందని అంటున్నాయి ట్రేడ్ వర్గాలు. మొత్తంగా ప్రపంచవ్యాప్తంగా 3 కోట్ల 15 లక్షల గ్రాస్, ఒక కోటి 32 లక్షల షేర్ వసూలు చేసిందంటున్నారు. ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ వచ్చేసి.. ఒక కోటి 15 లక్షల వరకు జరిగింది. దాంతో మూడు రోజుల్లోనే లాభాల బాట పట్టిందని చెప్పొచ్చు.
మార్చి 3న రిలీజ్ అయిన ‘బలగం’ సినిమా.. మంచి పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. నటుడు కమెడియన్ వేణు యెల్దండి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా.. అచ్చమైన తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలను ప్రతిబింబిస్తూ రూపొందింది. చావు చుట్టు కథను చాలా ఎమోషనల్‌గా తెరపైకి తీసుకొచ్చాడు వేణు. ప్రియదర్శి, కావ్య కళ్యాణ్ రామ్ లీడ్ రోల్ పోషించగా.. దిల్ రాజు ప్రొడక్షన్స్ బ్యానర్‌పై హర్షిత్, హన్షిత నిర్మించారు. ఇక ఈ సినిమా పై విమర్శకులు సైతం ప్రశంసలు కురిపిస్తుండడంతొ.. మూడు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ టార్గెట్ రీచ్ అయినట్టు తెలుస్తోంది. ఫస్ట్ డే 55 లక్షలు, సెకండ్ డే 80 లక్షలు, మూడో రోజు కోటి 75 లక్షలు వసూలు చేసిందని అంటున్నాయి ట్రేడ్ వర్గాలు. మొత్తంగా ప్రపంచవ్యాప్తంగా 3 కోట్ల 15 లక్షల గ్రాస్, ఒక కోటి 32 లక్షల షేర్ వసూలు చేసిందంటున్నారు. ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ వచ్చేసి.. ఒక కోటి 15 లక్షల వరకు జరిగింది. దాంతో మూడు రోజుల్లోనే లాభాల బాట పట్టిందని చెప్పొచ్చు. ఇలాగే ఉంటే.. ఈ వీకెండ్ వరకు బలగం మరింత బలమైన వసూళ్లను రాబట్టే ఛాన్స్ ఉందంటున్నారు. ఇదిలా ఉంటే.. ఈ సినిమా కథపై వివాదం నడుస్తున్న సంగతి తెలిసిందే. బలగం కథ తనదేనని జర్నలిస్ట్ గడ్డం సతీష్ అనే వ్యక్తి మీడియా ముందు ఆరోపణలు చేశారు. దీనిపై దర్శకుడు వేణు యెల్దండి స్పందించారు. ఈ సినిమా ఓ కథ కాదని, తెలుగు వారి అందరి జీవితాల్లో జరిగే ఆచార, సాంప్రదాయాలని.. ఇది తనన ఫ్యామిలీ ఆధారంగా రాసుకున్న కథ.. అని చెప్పారు. అంతేకాదు.. సదరు వ్యక్తికి దిల్ రాజు ఓపెన్ ఆఫర్ ఇచ్చారని.. దమ్ముంటే కొత్త కథతో రావాలని చెప్పుకొచ్చారు. ఇదిలా ఉంటే.. వేణు మళ్లీ దిల్ రాజు బ్యానర్లోనే మరో ప్రాజెక్ట్ చేయబోతున్నట్టు తెలుస్తోంది. త్వరలోనే పూర్తి వివరాలు తెలియనున్నాయి.